
యోగా సాధనతో సంపూర్ణ ఆరోగ్యం
గోదావరిఖనిటౌన్: యోగా సాధనతో సంపూర్ణ ఆ రోగ్యంగా ఉంటారని, ఆయుష్సు పెరుగుతుందని జిల్లా అదనపు కోర్టు జిల్లా న్యాయమూర్తి శ్రీనివాసరావు అన్నారు. స్థానిక జిల్లా అదనపు కోర్టులో ఆ యన అధ్యక్షతన శుక్రవారం అంతర్జాతీయ యోగా దినోత్సవం నిర్వహించారు. యోగా గురువు గణేశ్ యోగా సాధన, ప్రాణాయామం తదితర అంశాల పై వివరించారు. ప్రిన్సిపల్ జూనియర్ సివిల్ జడ్జి మంజుల, రెండో అదనపు జూనియర్ సివిల్ జడ్జి వెంకటేశ్ దుర్వ, బార్ అసోసియేషన్ అధ్యక్షుడు సతీశ్, ప్రధాన కార్యదర్శి శ్రీనివాస్ పాల్గొన్నారు.
జిల్లా అదనపు న్యాయమూర్తి శ్రీనివాస్