గెలుపెవరిదో.. | - | Sakshi
Sakshi News home page

గెలుపెవరిదో..

Dec 3 2023 12:42 AM | Updated on Dec 3 2023 12:42 AM

- - Sakshi

ఓట్ల లెక్కింపునకు ఏర్పాట్లు పూర్తి

సాక్షి ప్రతినిధి, కరీంనగర్‌:

ఉమ్మడి కరీంనగర్‌ జిల్లాలోని 12 అసెంబ్లీ స్థానాల కు సంబంధించిన ఓట్ల లెక్కింపునకు ఏర్పాట్లు పూర్తయ్యాయి. ఆదివారం ఉదయం 8 గంటలకు తొలుత పోస్టల్‌ బ్యాలెట్‌ ఓట్లు లెక్కించనున్న అధి కారులు వీటి ఫలితాలను తొలి అరగంటలో వెల్ల డించనున్నారు. ఉమ్మడి జిల్లాలోని కార్పొరేషన్లలో తక్కువ ఓటింగ్‌ నమోదైంది. పోలైన ఓట్ల పరంగా చూసినప్పుడు కరీంనగర్‌ 2,24,504 ఓట్లతో మొద టి స్థానంలో, రామగుండం 1,51,865 ఓట్లతో చివ రి స్థానంలో నిలిచింది. ఎలాంటి సాంకేతిక సమస్యలు తలెత్తని పక్షంలో రామగుండం ఫలితాలే మొద ట వచ్చే అవకాశముంది. ఓట్ల లెక్కింపు కేంద్రాల వద్ద పోలీసులతో బందోబస్తు ఏర్పాటు చేశారు. కరీంనగర్‌, హుజూరాబాద్‌ నియోజవర్గాల ఫలితా లపై కోస్తాంధ్రలో బెట్టింగ్‌ జోరుగా జరుగుతోంది.

కరీంనగర్‌ ఎస్సారార్‌ కాలేజీలో..

కరీంనగర్‌లోని ఎస్సారార్‌ కాలేజీలో కరీంనగర్‌, మానకొండూర్‌, హుజూరాబాద్‌, చొప్పదండి నియోజకవర్గాల ఓట్లు లెక్కించనున్నారు. ఇందుకోసం ఎన్నికల సిబ్బంది ర్యాండమైజేషన్‌ ప్రక్రియను కౌంటింగ్‌ పరిశీలకులు సీఆర్‌ ప్రసన్న, ఎస్‌జే చౌడ, మనీష్‌ కుమార్‌ లోహన్‌ సమక్షంలో పూర్తి చేసినట్లు జిల్లా ఎన్నికల అధికారి, కలెక్టర్‌ పమేలా సత్పతి తెలిపారు. అన్ని నియోజకవర్గాలకు పోలైన ఓట్ల ఆధారంగా కౌంటింగ్‌ సూపర్‌వైజర్లు, కౌంటింగ్‌ అసిస్టెంట్లు, మైక్రో అబ్జర్వర్లు, రిజర్వు సిబ్బందిని అందుబాటులో ఉంచామని పేర్కొన్నారు.

జగిత్యాల వీఆర్‌కే కళాశాలలో..

జగిత్యాల జిల్లా కేంద్రంలోని వీఆర్‌కే కళాశాలలో ఓట్ల లెక్కింపు కోసం ఏర్పాట్లు పూర్తి చేశారు. కోరుట్ల, ధర్మపురి, జగిత్యాల నియోజకవర్గాలకు చెందిన అభ్యర్థుల ఓట్ల లెక్కింపును లెక్కించనున్నారు. ఒక్కో నియోజకవర్గానికి సంబంధించి 14 టేబుళ్లను ఏర్పాటు చేశారు. ప్రతీ టేబుల్‌ వద్ద ఒక సూపర్‌వైజర్‌, ఒక మైక్రో అబ్జర్వర్‌, ఒక కౌంటింగ్‌ అసిస్టెంట్‌ ఉంటారు. జగిత్యాల ఫలితం 19, ధర్మపురి ఫలితం 20, కోరుట్ల ఫలితం 19 రౌండ్లలో వెలువడనున్నాయి.

జేఎన్టీయూలో పెద్దపల్లి కౌంటింగ్‌..

పెద్దపల్లి జిల్లాలోని పెద్దపల్లి, మంథని, రామగుండం నియోజవర్గాల ఓట్లను రామగిరి మండలంలోని జేఎన్టీయూ బ్లాక్‌–2లో లెక్కించనున్నారు. జిల్లాలో తొలి ఫలితం రామగుండానిదే. తర్వాత పెద్దపల్లి, మంథని ఫలితాలు వెలువడే అవకాశాలున్నాయి.

బద్దెనపల్లి గురుకులంలో సిరిసిల్ల, వేములవాడ..

రాజన్నసిరిసిల్ల జిల్లాలోని సిరిసిల్ల, వేములవాడ నియోజకవర్గాల ఓట్ల లెక్కింపును తంగళ్లపల్లి మండలంలోని బద్దెనపల్లి గురుకుల విద్యాలయంలో చేపట్టనున్నారు. జిల్లా ఎన్నికల అధికారి, కలెక్టర్‌ అనురాగ్‌ జయంతి, ఎస్పీ అఖిల్‌ మహాజన్‌ ఏర్పాట్లను శనివారం పరిశీలించారు. ఆదివారం ఉదయం 8 గంటల నుంచి ఓట్ల లెక్కింపు జరుగుతుందని కలెక్టర్‌ పేర్కొన్నారు.

జేఎన్టీయూ కౌంటింగ్‌ కేంద్రంలో ఏర్పాట్లు

ఉమ్మడి జిల్లాలో ఓట్ల వివరాలు..

నియోజకవర్గం పోస్టల్‌ బ్యాలెట్‌ ఈవీఎంలు పోలైన ఓట్లు రౌండ్లు టేబుళ్లు

కరీంనగర్‌ 1,700 390 2,24,504 25 16

చొప్పదండి 974 327 1,81,194 24 14

మానకొండూరు 1,424 287 1,84,413 23 14

హుజూరాబాద్‌ 1,981 305 2,07,609 22 14

పెద్దపల్లి 1,815 580 2,07,397 21 14

మంథని 993 576 1,95,635 20 14

రామగుండం 1,356 520 1,51,865 19 14

జగిత్యాల 1,997 254 174584 19 14

కోరుట్ల 1,680 270 1,82,140 19 14

ధర్మపురి 1,295 259 1,79,271 20 14

సిరిసిల్ల 1,676 287 1,88,202 21 14

వేములవాడ 1,306 260 1,74,300 19 14

1
1/1

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement