
పోరాడి సాధించుకు న్న తెలంగాణను సీ ఎం కేసీఆర్ ఆధ్వర్యంలో దేశానికే ఆదర్శంగా నిలిచేలా తీర్చిదిద్దారు. అభివృద్ధి సంక్షేమ పథకాలను గుర్తించిన ఓటర్లు ఈసారి ఎన్నికల్లోనూ ఎన్నుకుంటారనే విశ్వాసం ఉంది. తప్పకుండా గెలిచి హ్యాట్రిక్ విజయం సాధిస్తా.
– దాసరి మనోహర్‌రెడ్డి, బీఆర్‌ఎస్ అభ్యర్థి, పెద్దపల్లి
మార్పు తథ్యం
నీళ్లు, నిధులు, నియామకాలు అంటూ తెలంగాణ ప్రజలను నమ్మించి మోసగించిన పాలకులకు విముక్తి కల్పించాలని ప్రజలు కోరుకుంటున్నారు. ఓడినా, గెలిచినా ప్రజల మధ్య ఉంటూ సమస్యలపై పోరాటం చేస్తున్న. తనపై నమ్మకంతో ఈసారి ఎన్నికల్లో ఓటిచ్చి ఎన్నుకుంటారని విశ్వాసం ఉంది. మార్పు తథ్యం.
– విజయరమణారావు, కాంగ్రెస్ అభ్యర్థి, పెద్దపల్లి
