
పోలింగ్ కేంద్రం వద్ద సీపీ రెమా రాజేశ్వరి
గోదావరిఖని: పోలీసు నిఘా నీడలో రామగుండం పోలీస్ కమిషరేట్‌లో ప్రశాంతంగా ఎన్నికలు జరిగాయని రామగుండం సీపీ రెమా రాజేశ్వరి అన్నారు. గురువారం కమిషనరేట్ పరిధిలోని పెద్దపల్లి, మంచిర్యాల జిల్లాల్లో ఆకస్మికంగా సందర్శించారు. పెద్దపల్లి జిల్లా మంథని నియోజకవర్గంలోని మంథని, ప్రభుత్వ జూనియర్ కళాశాల, పెద్దపల్లి నియోజకవర్గంలోని ప్రభుత్వ జూనియర్ కళాశాల, రామగుండం నియోజకవర్గంలోని గోదావరిఖని సెక్రెడ్ హార్ట్ హైస్కూల్ సందర్శించి విధి నిర్వహణలో ఉన్న అక్కడి పోలీసు అధికారులకు, సిబ్బందికి ఎన్నికల నిర్వహణ, పోలింగ్ తర్వాత పరికరాలను కౌంటింగ్ కేంద్రాలకు తరలింపు గురించి ఆదేశాలు జారీ చేశారు. అనంతరం మాట్లాడుతూ ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు, గొడవలు జరగకుండా పటిష్టమైన భద్రత ఏర్పాట్లు చేశామన్నారు. ప్రశాంతంగా ఎన్నికల నిర్వహణకు సహకరించిన ఓటర్లకు కృతజ్ఞతలు తెలిపారు. సీపీ వెంట మంచిర్యాల డీసీపీ సుధీర్‌కేకన్, గోదావరిఖని ఏసీపీ తుల శ్రీనివాస్‌రావు, మంథని సీఐ సతీశ్, పెద్దపల్లి సీఐ అనిల్‌కుమార్, చెన్నూర్‌రూరల్ సీఐ విద్యాసాగర్, టాస్క్ ఫోర్స్ సీఐ అశోక్‌కుమార్ ఎసైలు ఉన్నారు.
రామగుండం సీపీ రెమా రాజేశ్వరి
పలు పోలింగ్ కేంద్రాల ఆకస్మిక తనిఖీ