
సుల్తానాబాద్(పెద్దపల్లి): డాక్టర్ చదువుకు దాతలు సహకరించాలని కోరుతున్నాడు నిరుపేద విద్యార్థి. సుల్తానాబాద్ మండలం గర్రెపల్లి గ్రామానికి చెందిన కొత్తూరి శ్రీనివాస్–సంధ్య దంపతులకు ఇద్దరు కుమారులు. స్థానికంగా వడ్రంగి వృత్తి సాగకపోవడంతో 20 ఏళ్ల క్రితం విజయవాడకు వలస వెళ్లారు. అక్కడ కొద్ది రోజులు వెల్డర్‌గా పనిచేసి, తర్వాత హమాలీ పని చేస్తూ కుటుంబాన్ని పోషించుకుంటున్నాడు.
పెద్ద కుమారుడు ఆదిత్య చదువులో చురుకుగా ఉంటూ పదో తరగతిలో 9.5 జీపీఏ, ఇంటర్‌లో 960 మార్కులు సాధించాడు. నీట్‌లో 445 మార్కులు రావడంతో వరంగల్ ప్రతిమ కళాశాలలో సీటు వచ్చింది. డాక్టర్ సీటు వచ్చినా పేద కుటుంబం కావడంతో చదివించే స్థోమత లేదు. దాతలు సాయం చేయాలని కోరుతున్నారు.