
హారతులతో స్వాగతం పలుకుతున్న మహిళలు
గోదావరిఖని: కాంగ్రెస్‌ను గెలిపిస్తే అభివృద్ధి చేసి చూపిస్తామని కాంగ్రెస్ జిల్లా అధ్యక్షుడు ఎంఎస్.రాజ్‌ఠాగూర్ అన్నారు. హాథ్‌సేహాథ్ జోడో కార్యక్రమంలో భాగంగా బుధవారం జీడీకే–5 ఓసీపీ, ఏరియా వర్క్‌షాప్, గాంధీనగర్‌లో పర్యటించారు. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల వైఫల్యాలను ఎండగట్టారు. తొమ్మిదేళ్ల దొరల పాలనలో ఏ ఒక్కరికీ ఇల్లు రాలేదని, కరెంట్ బిల్లులు మోత మోగుతోందన్నారు. రైతుల రుణమాఫీ జరగలేదన్నారు. కాంగ్రెస్ అధికారంలోకొస్తే ఏకకాలంలో రైతులకు రూ.2లక్షల రుణమాఫీ చేస్తామన్నారు. సింగరేణికార్మికుల హక్కుల రక్షణ, సౌకర్యాలపై దృష్టి సారిస్తామన్నారు. కార్యక్రమంలో ఆయన సతీమణి మనాలిఠాగూర్, నాయకులు కాల్వ లింగ స్వామి, ముస్తఫా, మహంకాళి స్వామి, పెద్దెల్లి ప్రకాశ్, గాధం విజయానంద్, తాళ్లపళ్లి యుగేందర్, గట్ల రమేశ్, అనుమ సత్తి, విజయ్, నజీమోద్దీన్, కొమ్ము శ్రీనివాస్, సారంగపాణి, చుక్కల శ్రీనివాస్ పాల్గొన్నారు.
స్వయం సహాయక సంఘాలకు రుణాలు
పెద్దపల్లిరూరల్: ప్రధానమంత్రి సూక్ష్మ ఆహార ఉత్పత్తి తయారీ సంస్థల వ్యవస్థీకరణ పథఽకం కింద స్వయం సహాయక సంఘాలకు 35శాతం రాయితీపై రుణాలు అందిస్తున్నట్లు డీఆర్‌డీవో శ్రీధర్ తెలిపారు. పథకం కింద ఫ్లోర్‌మిల్, బేకరీ, రైస్‌మిల్, పచ్చళ్ల తయారీ, ప్యాకింగ్ ఆయిల్‌మిల్ తదితర వ్యాపారాలు చేసుకోవచ్చని, రుణం పొందాలనుకునే వారు ఏప్రిల్ 10లోగా దరఖాస్తు చేసుకోవాలని సూచించారు. 10శాతం వ్యక్తిగత వాటా చెల్లించడంతోపాటు ఆధార్, పాన్‌కార్డు, బ్యాంకు పాసుపుస్తకం, కొటేషన్ వ్యాపార టర్నోవర్ ఉంటే రాయితీ వర్తిస్తుందని వివరించారు.
రాములోరి పెళ్లికి ఆలయాలు ముస్తాబు
పెద్దపల్లిరూరల్: శ్రీసీతారామచంద్రస్వామి కల్యాణానికి ఆలయాలు ముస్తాబయ్యాయి. పెద్దపల్లి పట్టణం శాంతినగర్‌లోని శ్రీకోదండరామస్వామి, శ్రీసీతారామస్వామి ఆలయంతోపాటు స్టేషన్ రోడ్డు తదితర హనుమాన్ ఆలయాలను అందంగా అలంకరించారు. భక్తులకు అసౌకర్యం కలగకుండా ఏర్పాట్లు చేసినట్లు నిర్వాహకులు తెలిపారు.
రాహుల్‌పై అనర్హత అప్రజాస్వామికం
మంథని: ప్రజాస్వామ్యాన్ని ఖూనీ చేసే రీతిలో ప్రధాని మోదీ సర్కార్ పనిచేస్తోందని, రాహుల్‌గాంధీపై అనర్హత వేటు అప్రజాస్వామికమని మంథని ఎమ్మెల్యే దుద్దిళ్ల శ్రీధర్‌బాబు అన్నారు. రాహుల్‌పై వేటుకు నిరసనగా మంథని ప్రధాన చౌరస్తాలో ప్రజాస్వామ్య పరిరక్షణ నిరసన దీక్ష చేపట్టారు. రాహుల్‌కు ప్రజల్లో వస్తున్న ఆదరణ చూసి ఓర్వలేకపోతున్నారని పేర్కొన్నారు. రాహుల్‌గాంధీ భారత జాతిని ఏకం చేసేందుకు చేపట్టిన జోడోయాత్ర జీర్ణించుకోలేకపోయారన్నారు. అదానీ ఆస్తులపై జేపీసీ డిమాండ్ చేసినందుకే ఆయన సభ్యుత్వం రద్దు చేశారని పేర్కొన్నారు. పార్టీ మండల అధ్యక్షుడు సెగ్గెం రాజేష్, కిసాన్ కాంగ్రెస్ రాష్ట్ర కో–ఆర్డినేటర్ శశిభూషణ్ కాచే, బ్లాక్ కాంగ్రెస్ అధ్యక్షుడు తొట్ల తిరుపతి యాదవ్, జయశంకర్ భూపాలపల్లి జిల్లా కాంగ్రెస్ అధ్యక్షుడు ఐత ప్రకాష్‌రెడ్డితో పాటు తదితరులు ఉన్నారు.

మాట్లాడుతున్న ఎమ్మెల్యే శ్రీధర్‌బాబు
