
పెద్దపల్లిరూరల్: పెద్దపల్లి బార్ అసోసియేషన్‌కు బుధవారం ఎన్నికలు నిర్వహించారు. జిల్లా కోర్టులో జరిగిన ఎన్నికల్లో లకిడి భాస్కర్ అధ్యక్షుడిగా ఎన్నికయ్యారు. ప్రధాన కార్యదర్శిగా రెడ్డి శంకర్, ఉపాధ్యక్షుడిగా డీవీఎస్.మూర్తి, జాయింట్ సెక్రటరీగా కోటగిరి శ్రీనివాస్, కోశాధికారిగా రాచూరి శ్రీకాంత్, లైబ్రరీ కార్యదర్శిగా బొంకూరి సంతోష్, స్పోర్ట్స్ కల్చరల్ సెక్రటరీగా సత్యనారాయణ, మహిళా ప్రతినిధిగా రమాదేవి, కార్యవర్గ సభ్యులుగా కుడిక్యాల శ్రీధర్, గణేశ్, రమేశ్ ఎన్నికయ్యారు. వీరికి సీనియర్ న్యాయవాదులు అభినందనలు తెలిపారు.
డ్రంకెన్ డ్రైవ్‌లో ముగ్గురికి జైలు
పెద్దపల్లి రూరల్: మద్యంతాగి వాహనాలు నడుపుతూ పట్టుబడిన ముగ్గురికి ఒకరోజు జైలుశిక్ష, జరిమానా విధించినట్లు ట్రాఫిక్ సీఐ అనిల్ కుమార్ తెలిపారు. పెద్దపల్లిలోని కొంతంవాడకు చెందిన రవీందర్, మహారాష్ట్ర గడ్చిరోలికి చెందిన ముల్కరి రోహిత్ మధుకర్, సుల్తానాబాద్ శాసీ్త్రనగర్‌కు చెందిన కల్వల వినయ్‌కు జూనియర్ సివిల్ జడ్జి రాణి ఒకరోజు జైలుతో పాటు రూ.3వేల జరిమానా విధించారని చెప్పారు.