జేఎన్టీయూలో బీజోన్‌ స్థాయి క్రికెట్‌ పోటీలు | - | Sakshi
Sakshi News home page

జేఎన్టీయూలో బీజోన్‌ స్థాయి క్రికెట్‌ పోటీలు

Mar 29 2023 12:28 AM | Updated on Mar 29 2023 12:28 AM

అవగాహన కల్పిస్తున్న డీఎంహెచ్‌ఓ - Sakshi

అవగాహన కల్పిస్తున్న డీఎంహెచ్‌ఓ

రామగిరి(మంథని): సెంటినరీకాలనీలోని జేఎన్టీయూలో ఈనెల 31 నుంచి బీజోన్‌ స్థాయి క్రికెట్‌ టోర్నమెంట్‌ నిర్వహిస్తున్నట్లు ప్రిన్సిపాల్‌ విష్ణువర్ధన్‌ తెలిపారు. వర్సిటీలోని తన చాంబర్‌లో టోర్నమెంట్‌ పోస్టర్‌ను మంగళవారం ఆవిష్కరించారు. బీజోన్‌ పరిధిలోని ఉమ్మడి కరీంనగర్‌, వరంగల్‌, ఖమ్మం జిల్లాలోని ఇంజినీరింగ్‌, ఫార్మసీ, ఎంబీఏ, ఎంసీఏ కళాశాలల జట్లు పోటీల్లో పాల్గొంటాయని, పూర్వ క్రీడాకారుల ఆర్థిక సహాయంతో ఉచిత భోజనం, వసతి కల్పిస్తున్నామని పేర్కొన్నారు. ప్రతి మ్యాచ్‌కు మ్యాన్‌ఆఫ్‌ది మ్యాచ్‌, ప్రాతినిధ్య, ప్రతిభ సర్టిఫికెట్లతోపాటు విజేతలకు బహుమతులు ఉంటాయని వివరించారు. ఈఈఈ విభాగం అధిపతి దుర్గారావ్‌, డీఈఈ సతీశ్‌, సూపరింటెండెంట్‌ రవికుమార్‌, ఫిజికల్‌ డైరెక్టర్‌ పింగిళి కృష్ణారెడ్డి పాల్గొన్నారు.

సీపీఆర్‌పై అవగాహన పెంచుకోవాలి

పెద్దపల్లిరూరల్‌: ఇటీవలి కాలంలో గుండెపోటుతో మరణాలు ఆందోళన కలిగిస్తున్నాయని, గుండెపోటుకు గురైనవారికి సత్వరమే సీపీఆర్‌ చేస్తే ప్రాణాలు కాపాడే అవకాశముందని డీఎంహెచ్‌వో డాక్టర్‌ ప్రమోద్‌కుమార్‌ అన్నారు. కలెక్టరేట్‌ ప్రాంగణంలో మంగళవారం వివిధ ప్రభుత్వ శాఖల అధికారులు, సిబ్బందికి సీపీఆర్‌పై శిక్షణ ఇచ్చారు. అకస్మాత్తుగా గుండెపోటుకు గురైన వారికి సీపీఆర్‌తో ప్రాణాలు రక్షించే అవకాశాలు ఉన్నాయని తెలిపారు. సీపీఆర్‌ చేసే విధానంపై అధికారులు, సిబ్బందికి అవగాహన కల్పించారు. వారి సందేహాలను నివృత్తి చేశారు. మూడునెలల కాలంలో ఆరువేల మందికి శిక్షణ ఇవ్వాలని లక్ష్యంగా పెట్టుకున్నామని, త్వరలోనే పూర్తి చేస్తామని వివరించారు.

ఏకగ్రీవంగా ఇండియన్‌ రెడ్‌క్రాస్‌ సొసైటీ కార్యవర్గం

పెద్దపల్లిరూరల్‌: ఇండియన్‌ రెడ్‌క్రాస్‌ సొసైటీ జిల్లా కార్యవర్గం ఏకగ్రీవంగా ఎన్నికై ందని ఎన్నికల అధికారి మైఖేల్‌బోస్‌ తెలిపారు. రెడ్‌క్రాస్‌ సొసైటీకి ఎన్నిక ప్రారంభించగా పదవులకు ఒక్కో నామినేషన్‌ దాఖలు కావడంతో ఏకగ్రీవమైనట్లు ప్రకటించారు. జిల్లా చైర్మన్‌గా కావేటి రాజ్‌గోపాల్‌ రెండోసారి ఎన్నికయ్యారు. వైస్‌చైర్మన్‌గా తూము రవీందర్‌, సెక్రటరీగా సాదుల వెంకటేశ్వర్లు, కోశాధికారిగా వీరగోని శ్రీనివాస్‌, స్టేట్‌ ఎంసీ సభ్యులుగా ఎరబాటి వెంకటేశ్వర్‌రావు, సభ్యులుగా అంజన్‌కుమార్‌, డీవీఎస్‌.మూర్తి, వెంకటేశ్‌, శ్రీకాంత్‌ ఎన్నికై నట్లు వివరించారు. నూతన కార్యవర్గాన్ని కలెక్టర్‌ సంగీత, అడిషనల్‌ కలెక్టర్‌ లక్ష్మీనారాయణ, కుమార్‌దీపక్‌ అభినందించారు.

పరిజ్ఞానం ఉంటేనే ప్రాధాన్యత

జ్యోతినగర్‌: మార్పులకు అనుగుణంగా పరిజ్ఞానం పెంచుకుంటేనే ప్రాధన్యత ఉంటుందని ఎన్టీపీసీ రామగుండం ప్రాజెక్టు ఎగ్జిక్యూటివ్‌ డైరెక్టర్‌ సునీల్‌కుమార్‌ అన్నారు. మంగళవారం టెంపరరీ టౌన్‌షిప్‌లోని ఉద్యోగ వికాసకేంద్రం మిలీనియం హాల్‌లో హెచ్‌ఆర్‌ విభాగం కార్పొరేట్‌ కమ్యూనికేషన్‌ సెల్‌ ఆధ్వర్యంలో తెలంగాణ సీనియర్‌ ఎగ్జిక్యూటివ్‌లకు నిర్వహించిన వర్క్‌షాప్‌లో మాట్లాడారు. ప్రతి ఉద్యోగి కార్పొరేట్‌ కమ్యూనికేషన్‌ స్కిల్స్‌ను కలిగి ఉండేందుకు ముందుకు సాగాలని కోరారు. సంస్థ మాజీ జీఎం రవీంద్రన్‌ కమ్యూనికేషన్‌ స్కిల్స్‌పై అవగాహన కల్పించారు. సీజీఎం ప్రసేంజిత్‌ పాల్‌, జనరల్‌ మేనేజర్లు పుష్పేంద్రకుమార్‌ లాఢ్‌ ఉన్నారు.

పోస్టర్‌ ఆవిష్కరిస్తున్న ప్రిన్సిపాల్‌ విష్ణువర్ధన్‌
1
1/3

పోస్టర్‌ ఆవిష్కరిస్తున్న ప్రిన్సిపాల్‌ విష్ణువర్ధన్‌

కలెక్టర్‌తో రెడ్‌క్రాస్‌సొసైటీ కార్యవర్గం2
2/3

కలెక్టర్‌తో రెడ్‌క్రాస్‌సొసైటీ కార్యవర్గం

రాజ్‌గోపాల్‌3
3/3

రాజ్‌గోపాల్‌

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement