
జీఎంకు వినతి పత్రం ఇస్తున్న రెసిడెన్షియల్ కమిటీ సభ్యులు
రామగిరి(మంథని): సెంటినరీకాలనీలో సింగరేణి కమ్యూనిటీ హాల్ వెనక నిర్మించిన నూతన పార్కులో ఓపెన్ జిమ్ ఏర్పాటు చేయాలని టీజీబీకేఎస్ యూనియన్ రెసిడెన్షియల్ కమిటీ సభ్యులు కోరారు. ఈ మేరకు మంగళవారం ఆర్జీ–3 జీఎం తన్నీరు వెంకటేశ్వర్‌రావును కలిసి, వినతి పత్రం అందించారు. తెలంగాణ చౌరస్తా సమీపంలో ప్రధాన రహదారిపై గుంతలు ఏర్పడ్డాయని, దుమ్ము లేస్తుండటంతో కార్మికులు, కార్మిక కుటుంసభ్యులు ఇబ్బంది పడుతున్నారని తెలిపారు. వెంటనే మరమ్మతు చేయించాలని కోరారు. రాణీ రుద్రమదేవి స్టేడియం ఆవరణలో ఏర్పాటు చేసిన జిమ్‌లో ఆధునిక పరికరాలు ఏర్పాటు చేయాలన్నారు. సెంటినరీకాలనీలోని సింగరేణి క్వార్టర్స్‌కు రంగులు వేయించాలని, మురికి కాలువలకు మరమ్మతు చేపట్టి, పైపులు వేయాలని విన్నవించారు. వీటన్నింటికీ జీఎం సానుకూలంగా స్పందించి, సివిల్ అధికారిని పిలిచి, పనులు త్వరగా చేయమని ఆదేశించారని తెలిపారు. కార్యక్రమంలో రెసిడెన్షియల్ కమిటీ సభ్యులు అల్లం తిరుపతి, అల్లంకి రామారావు, బత్తుల రమేశ్, బొడ్డు వినయ్ పాల్గొన్నారు.
చెత్త తొలగించాలి
సెంటినరీకాలనీలోని సింగరేణి క్వార్టర్ల మధ్య ప్రమాదకరంగా ఉన్న చెట్లను కొట్టివేస్తున్న సిబ్బంది చెత్తను మాత్రం శుభ్రం చేచడం లేదని ఐఎన్టీయూసీ నాయకులు ఆరోపించారు. దీనివల్ల కార్మికులు, వారి కుటుంబసభ్యులు ఇబ్బందులు పడుతున్నారని తెలిపారు. ఈ మేరకు మంగళవారం ఆర్జీ–3 జీఎం తన్నీరు వెంకటేశ్వర్‌రావును కలిసి, చెత్త తొలగించాలని కోరుతూ వినతి పత్రం అందించారు. దీనికి ఆయన సానుకూలంగా స్పందించినట్లు తెలిపారు. కార్యక్రమంలో ఐఎన్టీయూసీ ఏరియా ఉపాధ్యక్షుడు కోట రవీందర్ రెడ్డి, నాయకులు శ్రీనివాస్‌రావు, తాళ్లపల్లి నారాయణ, మంగయ్య తదితరులు పాల్గొన్నారు.