
రామగిరి(మంథని): సింగరేణి కాలరీస్ కాంట్రాక్ట్ వర్కర్స్ యూనియర్ రాష్ట్ర ప్రధాన కార్యదర్శిగా పని చేస్తున్న ఆకుల వెంకన్న ఐఎఫ్‌టీయూ రాష్ట్ర సహాయ కార్యరద్శిగా ఎన్నికయ్యారు. విద్యార్థి దశలో 1978 నుంచి పీడీఎస్‌యూలో పని చేస్తూ 1991లో రామగుండం ఎరువుల కర్మాగారంలో కాంట్రాక్ట్ కార్మికుడిగా పని చేశారు. ఐఎఫ్‌టీయూ ఉపాధ్యక్షుడిగా ఈ ప్రాంతంలోని ఎన్టీపీసీ, బసంత్‌నగర్, పెద్దపల్లి ఇటుక బట్టీల, క్వారీల కార్మికులను ఆర్గనైజ్ చేస్తూ 2003 నుంచి సింగరేణిలో కాంట్రాక్ట్ కార్మికుల హక్కులు, సౌకర్యాల కల్పనకు రాజీలేని పోరాటాలు చేశారు.
ఉపాధిహామీ
ఏపీవో, టీఏ సస్పెన్షన్
ఓదెల(పెద్దపల్లి): మండలంలో ఉపాధిహామీ పథకంలో పనిచేసే ఏపీవో కొమురయ్య, టెక్నికల్ అసిస్టెంట్ లీలలను సస్పెండ్ చేస్తూ జిల్లా గ్రామీణాభివృద్ధి అధికారి శ్రీధర్ మంగళవారం ఉత్తర్వులు జారీ చేశారు. ఏపీవో, టెక్నికల్ అసిస్టెంట్‌లు అవినీతి అక్రమాలతోపాటు సామాజిక తనిఖీలో అవకతవకలకు పాల్పడటంతో విచారణ జరిపి, సస్పెన్షన్ వేటు వేసినట్లు ఆయన పేర్కొన్నారు.
ఇంటర్నేషనల్
టాలెంట్ టెస్ట్‌లో ప్రతిభ
యైటింక్లయిన్‌కాలనీ(రామగుండం): యైటింక్లయిన్‌కాలనీ బంగ్లాస్ ఏ రియా క్వార్టర్‌లో నివా సం ఉంటున్న ఓసీపీ–1 అడిషనల్ మేనేజర్ బైరి రమేశ్ కుమార్తె వరేణ్య ఇంటర్నేషనల్ టాలెంట్ సెర్ప్ ఒలింపియాడ్ టెస్ట్‌లో పలు అంశాల్లో జరిగిన పరీక్షలో ప్ర తిభ కనబరిచింది. ఆర్‌ఎఫ్‌సీఎల్ శ్రీ చైతన్య పాఠశాలలో ఆరోతరగతి చదువుతున్న ఆమె ఐదోస్థానంలో నిలిచి, గోల్డ్ మెడల్, మెరిట్ సర్టిఫికెట్‌తోపాటు ప్రత్యేక బహుమతి సాధించింది. ఈ సందర్భంగా వరేణ్యను పాఠశాల ప్రిన్సిపాల్, ఉపాధ్యాయులు, స్వచ్ఛంద సంఘాల సలహాదారుడు దయానంద్ గాంధీ మంగళవారం అభినందించారు.
జాతీయస్థాయి
కరాటే పోటీలకు ఎంపిక
రామగుండం: ఓదెల మండల కేంద్రంలో మంగళవారం డ్రాగన్ కుంగ్‌ఫూ మార్షల్ ఆర్ట్స్ ఆధ్వర్యంలో రాష్ట్రస్థాయి కరాటే పోటీలు నిర్వహించారు. అంతర్గాం మండలంలోని పొట్యాల హైస్కూల్ విద్యార్థులు పాల్గొన్నారు. అవినాష్, హర్షిత్, హఫీజ్, చేగువేరా, ఇందు, వర్షిత్‌లు గోల్డ్ మెడల్ సాధించగా, ప్రసన్న, అస్మా సిల్వర్ మెడల్ కై వసం చేసుకున్నారు. పతకాలు సాధించిన విద్యార్థులందరూ జాతీయ స్థాయి టోర్నమెంట్‌కు ఎంపికయ్యారని కరాటే మాస్టర్లు రామ్, లక్ష్మణ్‌లు తెలిపారు. ఈ సందర్భంగా విద్యార్థులను సర్పంచ్ ఎదులాపురం నీరజ, బీఆర్‌ఎస్ నాయకుడు వెంకటేశ్, హెచ్‌ఎం వెంకటరమణ తదితరులు అభినందించారు.

వెంకన్న

వరేణ్య