● రూ.50 వేలు సాయం అందించిన మాజీ డిప్యూటీ స్పీకర్ కోలగట్ల
విజయనగరం అర్బన్:
వైఎస్సార్‌సీపీ కుటుంబ సభ్యులకు ఎలాంటి క్లిష్ట పరిస్థితులు వచ్చినా పార్టీ అండగా నిలుస్తుందని శాసనసభ మాజీ డిప్యూటీ స్పీకర్ కోలగట్ల వీరభద్రస్వామి స్పష్టం చేశారు. ఇటీవల అకాల మరణం చెందిన విజయనగరం బాబామెట్ట నివాసి కోటి రెడ్డి కుటుంబ సభ్యులను ఆయన పరామర్శించి తమ ప్రగాఢ సానుభూతి తెలిపారు. ధైర్యంగా ఉండాలని ఓదార్చారు. కోటి రెడ్డి కుటుంబానికి పార్టీ అండగా ఉంటుందని హామీ ఇచ్చారు. తక్షణ ఆర్థిక సాయంగా రూ.50 వేలు అందజేశారు. ఆయన వెంట ఐదో డివిజన్ మాజీ కార్పొరేటర్ గాదం మురళి, వర్మరాజు, వైఎస్సార్‌సీపీ సోషల్ మీడియా విభాగం సభ్యులు కె.సుధాకర్, కాశిరెడ్డి నవీన్, సతీష్, సాయికుమార్, మువ్వల భాస్కర్, శ్రీహరిబాబు, రవి, శంకరరావు తదితరులు పాల్గొన్నారు.


