పార్వతీపురం: జిల్లాలో ఉల్లాస్–అక్షర ఆంధ్రా కార్యక్రమం విజయవంతంగా అమలు కావడంతో అక్షరాస్యత శాతం ఘననీయంగా పెరిగిందని కలెక్టర్ డా.ఎన్.ప్రభాకరరెడ్డి పేర్కొన్నా రు. తన చాంబర్‌లో శుక్రవారం ఆయన మీడియాతో మాట్లాడుతూ 2011లో 50.38శాతంగా ఉన్న అక్షరాస్యత, 2025 నాటికి 75.74 శాతానికి, 2026 నాటికి 83.87శాతానికి పెరిగిందన్నారు. జీఎస్‌డబ్ల్యూఎస్ సర్వేలో గుర్తించి న నిరక్ష్యరాస్యుల్లో లక్ష్యానికి మించి 67,686 మందిని నమోదు చేసి, శతశాతం ఉత్తీర్ణత సాధించడం విశేషమన్నారు. కార్యక్రమంలో వేలాది వలంటీరు టీచర్లు పాల్గొని విద్యాబోధ న అందించారన్నారు. అక్షరాస్యతలో పార్వతీ పురం మన్యం జిల్లాను అగ్రస్థానంలో నిలిపిన అధికారులను, వలంటీర్లను కలెక్టర్ అభినందించారు.
నేడు బీసీ డెడికేటెడ్ కమిషన్ అధ్యక్షుడు రాక
బీసీ రిజర్వేషన్లపై ప్రభుత్వం ఏర్పాటు చేసిన బీసీ డెడికేటెడ్ కమిషన్ అధ్యక్షుడు రాజీవ్ రంజ న్ మిశ్రా శనివారం విజయనగరం రానున్నట్లు కలెక్టర్ డాక్టర్ ఎన్.ప్రభాకరరెడ్డి శుక్రవారం తెలిపారు. ఉదయం 10 నుంచి మధ్యాహ్నం ఒంటి గంట వరకు కలెక్టర్ కార్యాలయంలో బీసీ, కుల సంఘాలు, ప్రజా ప్రతినిధులు, ప్రజల నుంచి వినతులను స్వీకరిస్తారన్నారు. జిల్లా ప్రజలు ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని ఆయన కోరారు.
కురుపాం: ‘జలధార–జలహారతి’ కార్యక్రమం అమలులో రాష్ట్రంలో జిల్లాను ముందంజలో నిలపాలని కలెక్టర్ డా.ఎన్.ప్రభాకరరెడ్డి అధికారులను ఆదేశించారు. చెరువుల పునరుద్ధరణ, భూగర్భ జలాల పెంపు, నీటి సంరక్షణ పనులు బాధ్యతగా చేపట్టాలన్నారు. కురుపాం ఎంపీడీ ఓ కార్యాలయంలో శుక్రవారం నిర్వహించిన సమీక్షలో ఆయన మాట్లాడారు. ఉపాధిహామీ పనుల్లో వేతనదారుల భాగస్వామ్యాన్ని పెంచాలని, 100 శాతం లేబర్ రిపోర్టింగ్ సాధించాల ని సూచించారు. అసంఘటిత రంగ కార్మికులందరూ ఈ–శ్రమ పోర్టల్‌లో నమోదు కావాలని, ఇది పూర్తిగా ఉచితమని, బీమా రక్షణతో పాటు కేంద్ర పథకాల ప్రయోజనాలు పొందేందుకు అవసరమని తెలిపారు. టీఏలు, ఫీల్డ్ అసిస్టెంట్లు, మేట్లు కలిసి 100 శాతం నమోదు పూర్తిచేయాలని ఆదేశించారు. సమావేశంలో డ్వామా పీడీ కె.రామచంద్రరావు పాల్గొన్నారు.
విజయనగరం అర్బన్: డెడికేటెడ్ కమిషన్ చైర్మన్ రాజీవ్ రంజన్‌మిశ్రా జిల్లాలో శనివారం పర్యటించనున్నట్టు కలెక్టర్ ఎస్.రాంసుందర్ రెడ్డి తెలిపారు. ఉదయం 10 నుంచి మధ్యా హ్నం ఒంటిగంట వరకు కలెక్టరేట్ సమావేశ మందిరంలో సంబంధిత అధికారులతో సమీక్ష సమావేశం నిర్వహించనున్నారు. అదే సమయంలో స్థానిక సంస్థల ఎన్నికల్లో బీసీ రిజర్వేషన్ల అంశంపై కుల సంఘాలు, ప్రజల నుంచి వినతులు స్వీకరించనున్నారు.


