పార్వతీపురం: సైన్స్ ఎక్స్‌పోజర్ టూర్–2026 వల్ల విద్యార్థుల్లో శాస్త్ర,సాంకేతిక రంగాలపై ఆసక్తి పెంపొందుతుందని కలెక్టర్ డాక్టర్ ఎన్.ప్రభాకరరెడ్డి తెలిపారు. కలెక్టర్ కార్యాలయ సమావేశ మందిరంలో విద్యాశాఖ ఆధ్వర్యంలో సైన్స్ ఎక్స్‌పోజర్‌టూర్–2026 పోస్టర్‌ను కలెక్టర్‌తో పాటు జేసీ సి.యశ్వంత్‌కుమార్ రెడ్డి, సీతంపేట ఐటీడీఏ పీఓ పవర్‌స్వప్నిల్ జగన్నాథ్ శనివారం ఆవిష్కరించారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ పాఠశాల విద్యాశాఖ, సమగ్ర శిక్ష ఆధ్వ ర్యంలో సైన్స్ ఎక్స్‌పోజర్ టూర్ ఒడిశా రాజధాని భువనేశ్వర్‌లో ఈ నెల 16, 17 తేదీల్లో నిర్వహిస్తామని తెలిపారు. విద్యార్థులకు ప్రయోగాత్మక అనుభవాన్ని అందించడంతోపాటు ఆధునిక పరికరాలు, సాంకేతికతపై అవగాహన కల్పిస్తారన్నారు. కార్యక్రమంలో ఏపీఓ పి.మురళీధర్, డీఈఓ పి.బ్రహ్మాజీరావు, డీడీఓ ఎ. విజయశాంతి పాల్గొన్నారు.
ప్రభుత్వ పాఠశాలల్లో అంతర్జాతీయ ప్రమాణాలతో విద్యాబోధన అందించాలని అధికారులను కలెక్టర్ అదేశించారు. కలెక్టరేట్‌లో ఐటీడీఏ అధికారులతో విద్యాసంబంధిత అంశాలపై సమీక్షించారు. ప్రతి విద్యార్థి తెలుగు, ఇంగ్లిష్, హిందీ భాషల్లో ప్రావీణ్యం సాధించడంతోపాటు గణితంలో పట్టు సాధించేలా చర్యలు చేపట్టాలని సూచించారు. కమ్యూనికేషన్ స్కిల్స్, ఆత్మ విశ్వాసం పెంపొందించడంపై దృష్టిపెట్టాలన్నారు.


