క్రికెట్‌ టోర్నీ విజేత ‘పార్వతీపురం’ | - | Sakshi
Sakshi News home page

క్రికెట్‌ టోర్నీ విజేత ‘పార్వతీపురం’

Apr 5 2026 8:36 AM | Updated on Apr 5 2026 8:36 AM

పార్వతీపురం రూరల్‌: విజయనగరం జేఎన్‌టీయూ – జీవీ మైదానంలో శనివారం నిర్వహించిన ఏపీ స్టేట్‌ ఆడిట్‌ విభాగం అంతర్‌ జిల్లా క్రికెట్‌ మ్యాచ్‌లో పార్వతీపురం జట్టు విజేతగా నిలిచింది. తొలుత బ్యాటింగ్‌ చేసిన విజయనగరం జట్టు 20 ఓవర్లలో 154 పరుగులు చేసింది. అనంతరం 155 పరుగుల లక్ష్యంతో బరిలోకి దిగిన పార్వతీపురం జట్టు 18.2 ఓవర్లలో ఏడు వికెట్లు కోల్పోయి విజయాన్ని అందుకుంది. కార్యక్రమంలో జిల్లా ఆడిట్‌ అధికారి కమల, రిలీఫ్‌ అకౌంట్స్‌ ఆడిట్‌ అధికారి హిమబిందు, మున్సిపల్‌ కార్పొరేషన్‌ అకౌంట్స్‌ ఆఫీసర్‌ కర్రి ఆదినారాయణ, జేఎన్‌టీయూ అకౌంట్‌ ఆఫీసర్‌ కొనపల గంగరాజు, అసిస్టెంట్‌ ఆడిట్‌ ఆఫీసర్‌ సీతారామమూర్తి పాల్గొన్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement