కురుపాం: ప్రస్తుత టీడీపీ పాలనపై ప్రజలు విసుగుచెందారని, వచ్చేది జగనన్న పాలనేనని మాజీ డిప్యూటీ సీఎం పాముల పుష్పశ్రీవాణి స్పష్టంచేశారు. ప్రతీ వైఎస్సార్‌సీపీ కార్యకర్త పార్టీ గుర్తింపు కార్డును కలిగిఉండాలని.. ఆ కార్డే పార్టీ కోసం కార్యకర్త చేసిన కృషికి ప్రామాణికంగా నిలుస్తుందని, భవిష్యత్‌లో భరోసా లభిస్తుందన్నారు. కురుపాం నియోజకవర్గంలోని ఐదు మండలాలకు చెందిన నాయకులు, కార్యకర్తలతో కురుపాం మండల కేంద్రంలో పార్టీ జిల్లా అధ్యక్షుడు శత్రుచర్ల పరీక్షిత్‌రాజు అధ్యక్షతన శనివారం నిర్వహించిన సమావేశంలో ఆమె మాట్లాడారు. పార్టీ కార్యకర్తలకు మొదటి ప్రాధన్యమిచ్చేందుకు వీలుగా ప్రతీకార్యకర్త గుర్తుంపు కార్డు పొందేలా మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి చర్యలు చేపట్టారన్నారు. మొదటి నుంచి పార్టీ కోసం కష్టపడిన కార్యకర్తకు భవిష్యత్ బాగుంటుందని, ప్రతీ కార్యకర్త విధిగా ఐడీ కార్డులు పొందాలన్నారు.
ప్రతీ వైఎస్సార్‌సీపీ కార్యకర్త గుర్తింపు కార్డును కలిగి ఉండాలి
కార్యకర్తలందరికీ సముచిత స్థానం
మాజీ ఉపముఖ్యమంత్రి పాముల పుష్పశ్రీవాణి


