బడ్జెట్‌లో బాధ్యత లేదు
చంద్రబాబు నేతృత్వంలో కూటమి ప్రభుత్వం తమ పాలన కాలంలో చేసిన అప్పులు ప్రజల ముందు చెప్పలేని స్థితిలో ఉన్నారని బడ్జెట్ తేల్చి చెప్పింది. గత బడ్జెట్‌లో ఏం చెప్పారో అవే లెక్కల్లో మార్పులు చేసి ప్రజలను ఏమార్చే ప్రయత్నం మళ్లీ చేశారు. బడ్జెట్‌కు సంబంధించి అంకెల గారడీ తప్పితే వాస్తవ లెక్కలు ఎక్కడా ప్రస్తావించలేదు. ఆదాయ, వ్యయాలకు సంబంధించి పదేళ్ల వివరణ బడ్జెట్ బుక్‌లో ఉంటుంది. కానీ ఇక్కడ అది లేకుండా పోయింది. చంద్రబాబు ప్రభుత్వం వృద్ధి రేటు సాధించడంలో పూర్తిగా విఫలమైంది. మూలధన వ్యయంపై కూడా అసత్యాలు వల్లె వేసింది. రూ.లక్షల కోట్లు అప్పులు చేసిన కూటమి ప్రజలకు అందించే సంక్షేమానికి నిధులు కేటాయించకపోవడం అన్యాయం. బడ్జెట్‌లో మరోమారు యువత, నిరుద్యోగులు, మహిళలు, రైతులు, విద్యార్థులు, ఉద్యోగులు మోసపోయారు. మన్యం జిల్లా అభివృద్ధికి ఎటువంటి ప్రత్యేక కేటాయింపులు లేకపోవడం అన్యాయం.
– పాలవలస విక్రాంత్, ఎమ్మెల్సీ


