బడ్జెట్‌తో వంచన
చంద్రబాబు కూటమి సర్కారు ప్రవేశపెట్టిన మూడో బడ్జెట్.. నిరుద్యోగులు, మహిళల పాలిట ‘వంచన పత్రం’లా ఉంది. 20 లక్షల ఉద్యోగాలు, రూ.3 వేల భృతి అని ఊరించి.. అధికారంలోకి వచ్చాక యువతను మోసగించారు. ఒక్కో నిరుద్యోగికి రావాల్సిన రూ.72 వేలను ఎగ్గొట్టి, అక్షరాలా రూ.21,600 కోట్ల మేర దగా చేసింది. నోటిఫికేషన్లను కోర్టుల పాలు చేసి, నిరుద్యోగుల కలల మీద నీళ్లు చల్లారు. ఆడబిడ్డ నిధి కింద నెలకు రూ.1,500 ఇస్తామని ఆశపెట్టి, మూడు బడ్జెట్లలోనూ పైసా కేటాయించకుండా మహిళల ఆత్మగౌరవాన్ని తాకట్టు పెట్టారు. ఈ 20 నెలల్లో ఆడబిడ్డలు ఏకంగా రూ.54 వేల కోట్లు నష్టపోయారు. బాబు పాలనలో జాబ్ క్యాలెండర్ అడ్రస్ లేకుండా పోయింది. సంపద సృష్టిస్తానన్న చంద్రబాబు. కేవలం అబద్ధాల అల్లికలు సృష్టి్‌ంచి, జనాన్ని అప్పుల కుప్పలో ముంచేస్తున్నారు.
– అలజంగి జోగారావు,
మాజీ ఎమ్మెల్యే, పార్వతీపురం


