చెక్కుచెదరని ఆత్మవిశ్వాసం | - | Sakshi
Sakshi News home page

చెక్కుచెదరని ఆత్మవిశ్వాసం

Feb 16 2026 7:17 AM | Updated on Feb 16 2026 7:17 AM

చెక్క

చెక్కుచెదరని ఆత్మవిశ్వాసం

75సంవత్సరాల ప్రాయంలో..

షటిల్‌ బ్యాడ్మింటన్‌లో

అంతర్జాతీయ కీర్తి

బలిజిపేట: బలిజిపేట నివాసి 75సంవత్సరాల అంగజాల గోపాలరావు షటిల్‌ బ్యాడ్మింటన్‌లో అంతర్జాతీయ స్థాయిలో బంగారు పతకాన్ని కై వసం చేసుకున్నారు. ఈనెల 11న అబుదాబిలో జరిగిన ఆలిండియా మాస్టర్స్‌ స్పోర్ట్స్‌ 2025–26 చాంపియన్‌ షటిల్‌ బ్యాడ్మింటన్‌ సింగిల్స్‌ పోటీల్లో సత్తాచాటి బంగారు పతకాన్ని సాధించారు. ఆయన ముందుగా హైదరాబాద్‌లో జరిగిన ఆలిండియా మాస్టర్స్‌ స్పోర్ట్స్‌ ఛాంపియన్‌,2026 పోటీల్లో పాల్గొని విజేతగా నిలిచారు. ఆ సంస్థ యూఏఈలో జరిగే పోటీల్లో పాల్గొనాలని ఆయనను కోరగా పాల్గొన్నారు. ఈ పోటీల్లో ప్రీ క్వార్టర్‌లో చైనా, క్వార్ట్‌ర్‌ ఫైనల్‌లో మలేషియా, సెమీఫైనల్‌లో జపాన్‌, ఫైనల్‌లో ఆస్ట్రేలియాలకు చెందిన ప్రత్యర్థులను ఓడించారు. చివరగా 75సంవత్సరాల వయస్సులో పోటీలో గెలిచి బంగారు పతకాన్ని సాధించారు. ఈ పతకాన్ని అబు దాబి పాలకుడు, యునైటెడ్‌ అరబ్‌ ఎమిరేట్స్‌ అధ్యక్షుడు షేక్‌ మోహమ్మద్‌ బిన్‌ జాయెద్‌ అల్‌ నహ్యాన్‌ కుమారుడు చేతుల మీదుగా అందుకున్నట్టు ఆయన తెలిపారు. 75సంవత్సరాల వయస్సులో ఇతర దేశంలో షటిల్‌ బ్యాడ్మింటన్‌ సింగిల్స్‌ పోటీల్లో పాల్గొని విజేతగా బలిజిపేట వాసి నిలవడం ఎంతో సంతృప్తికరంగా, ఆనందదాయకంగా ఉందని బలిజిపే ట వాసులు సంతోషం వ్యక్తం చేస్తున్నారు.

సంగాం జాతరలో పటిష్ట బందోబస్తు

వంగర: మహా శివరాత్రి సందర్భంగా సంగాంలోని సంగమేశ్వరస్వామి ఆలయం వద్ద ఆదివా రం జాతర ప్రారంభమైంది. వారం రోజుల పాటు నిర్వహించనున్న జాతరకు పటిష్ట బందో బస్తు ఏర్పాటు చేశామని రాజాం సీఐ జి.శంకరరావు తెలిపారు. తొలిరోజు జాతరకు 100 మంది పోలీసులతో బందోబస్తు ఏర్పాటు చేశారు.ఈ ఏడాది కొత్తగా ట్రాఫిక్‌ ఆంక్షలు పెట్టామని, జాతర స్థలానికి దూరంగా పార్కింగ్‌ పెట్టామని, క్యూలైన్‌లో భక్తులు ఇబ్బందులు పడకుండా పోలీసుల పర్యవేక్షణ ఉందన్నారు. జాతరలో విశాఖపట్నంకు చెందిన పనస రూపావతి పోగొట్టుకున్న మొబైల్‌ ఫోన్‌ను పోలీసులు గుర్తించి ఆమెకు అందజేశారు.

చెక్కుచెదరని ఆత్మవిశ్వాసం1
1/1

చెక్కుచెదరని ఆత్మవిశ్వాసం

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement