పారా వరల్డ్‌ గ్రాండ్‌ ప్రిక్స్‌ పోటీల్లో సత్తా చాటిన రాము | - | Sakshi
Sakshi News home page

పారా వరల్డ్‌ గ్రాండ్‌ ప్రిక్స్‌ పోటీల్లో సత్తా చాటిన రాము

Feb 15 2026 9:38 AM | Updated on Feb 15 2026 9:38 AM

పారా వరల్డ్‌ గ్రాండ్‌ ప్రిక్స్‌ పోటీల్లో సత్తా చాటిన రా

పారా వరల్డ్‌ గ్రాండ్‌ ప్రిక్స్‌ పోటీల్లో సత్తా చాటిన రా

పారా వరల్డ్‌ గ్రాండ్‌ ప్రిక్స్‌ పోటీల్లో సత్తా చాటిన రాము

విజయనగరం: దుబాయ్‌ వేదికగా ఈ నెల 5 నుంచి 14 వరకు జరిగిన 17వ వరల్డ్‌ పారా అథ్లెటిక్స్‌ గ్రాండ్‌ ప్రిక్స్‌ పోటీల్లో విజయనగరానికి చెందిన పారా క్రీడాకారుడు కొత్తింటి పైడి రాము సత్తా చాటాడు. డిస్కస్‌ త్రోలో సిల్వర్‌ మెడల్‌ మెడల్‌ సాధించి తానేంటో మరోసారి నిరూపించుకున్నాడు. ఈ సందర్భంగా పారా స్పోర్ట్స్‌ అసోసియేషన్‌ జిల్లా అధ్యక్షుడు కె.దయానంద్‌ పైడి రాము సాధించిన ఘనత పట్ల హర్షం వ్యక్తం చేశారు. అంతర్జాతీయ పారా ఒలింపిక్‌ కమిటీ ఆధ్వర్యంలో ఘనంగా నిర్వహించిన ఈ గ్రాండ్‌ ప్రిక్స్‌ పోటీల్లో గతం కంటే పోటీ అధికంగా ఉన్నప్పటికీ ఎఫ్‌ – 51 కేటగిరికి సంబంధించి డిస్కస్‌ త్రోలో అత్యుత్తమ ప్రతిభ కనబరచి మెడల్‌ సాధించడం అభినందనీయమని పేర్కొన్నారు. ఇదే స్ఫూర్తితో భవిష్యత్‌లో జాతీయ, అంతర్జాతీయ స్థాయిలో రాణించి దేశానికి, ఆంధ్రప్రదేశ్‌ రాష్ట్రానికీ మరిన్ని విజయాలు అందించాలని అకాంక్షించారు. పైడి రాముకు కలెక్టర్‌ రాంసుందరరెడ్డి, జాయింట్‌ కలెక్టర్‌ సేతుమాధవన్‌, జిల్లా క్రీడాభివృద్ధి అధికారి ఎస్‌.వెంకటేశ్వరరావు అభినందనలు తెలిపారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement