రైతాంగానికి ఉత్తచేయి
రాష్ట్ర బడ్జెట్‌లో రైతాంగానికి, జిల్లాలో సాగునీటి ప్రాజెక్టులకు తీవ్ర అన్యాయం చేశారు. రైతులకు సున్నావడ్డీ, పావలా వడ్డీ ఊసు లేదు. ప్రాజెక్టులకు సంబంధించి ఎటువంటి కేటాయింపులూ లేవు. నిధులు కేటాయిస్తున్నా.. ఖర్చులు ఉండటం లేదు. వ్యవసాయంలో కీలకమైన మొక్కజొన్నకు కొనుగోలు కేంద్రాలు లేవు. వంశధారకు ఇచ్చిన ప్రాధాన్యం జంఝావతికి ఎందుకు ఇవ్వడం లేదు. ఒట్టిగెడ్డ, పెదంకలాం, తోటపల్లి ఆధునికీకరణ విషయంలో నిర్లక్ష్యం చూపుతున్నారు. మన జిల్లాలో ఎమ్మెల్యేలు మౌనం వహిస్తున్నారు.
– బుడితి అప్పలనాయుడు, జిల్లా ప్రధాన కార్యదర్శి, ఆంధ్రప్రదేశ్ రైతు సంఘం
●


