ఘాట్‌రోడ్డులో వ్యాన్ బోల్తా
● ఒడిశాకు చెందిన వ్యక్తి మృతి
● మరో ఐదుగురికి గాయాలు
మక్కువ: కొండచీపుళ్లు కొనుగోలుచేసి, వారి స్వస్థలానికి చేరుకునే ఘాట్ రోడ్ మార్గంలో బొలెరో వ్యాన్ బ్రేక్ ఫెయిల్ అయి బోల్తాపడడంతో ఒకరు మృతిచెందగా, ఐదుగురు వ్యక్తులు గాయాలపాలయ్యారు. వివరాల్లోకి వెళ్లే.. ఒడిశా రాష్ట్రంలోని నవరంగపూర్ జిల్లా, తెంతులకుంటి తాలూకాకు చెందిన ఆరుగురు వ్యక్తులు గురువారం బొలెరో వ్యాన్‌లో కొరాపుట్ జిల్లా, గుమ్మటి గ్రామానికి కొండచీపుళ్లు కొనడానికి వెళ్లారు. కొండ చీపుళ్లు కొనుగోలు చేసి తిరుగు ప్రయాణంలో మక్కువ మండలం, పనసభద్ర పంచాయతీ బాగుజోల గ్రామం సమీపంలోని ఘాట్ రోడ్డు దిగుతుండగా వ్యాన్ బ్రేక్ ఫెయిల్ కావడంతో వాహనం అదుపుతప్పి బోల్తా పడింది. ఈ ప్రమాదంలో ఒడిశా రాష్ట్రానికి చెందిన గాసీరాం (50)కు తీవ్ర గాయాలు కావడంతో ఘటనా స్థలంలో మృతిచెందాడు. సుత్తాం అనే వ్యక్తికి కాలు, చేయి విరిగిపోగా పార్వతీపురం జిల్లా ఆస్పత్రికి తరలించారు. మరో నలుగురు వ్యక్తులకు స్వల్ప గాయాలు కావడంతో గాయపడిన వారిని 108 సిబ్బంది, మక్కువ పీహెచ్‌సీకి తరలించి ప్రథమ చికిత్స అందించారు. వ్యాన్ బోల్తా పడిన ప్రదేశం కాస్త సమాంతరంగా ఉండడంతో భారీ ప్రమాదం తప్పింది. సమాచారం మేరకు పోలీసులు సంఘటన స్థలానికి చేరుకుని కేసు నమోదు చేసి, దర్యాప్తు చేస్తున్నారు.
ఘాట్‌రోడ్డులో వ్యాన్ బోల్తా
ఘాట్‌రోడ్డులో వ్యాన్ బోల్తా


