నేడు పోలమాంబ అమ్మవారి మూడో జాతర | - | Sakshi
Sakshi News home page

నేడు పోలమాంబ అమ్మవారి మూడో జాతర

Feb 10 2026 7:55 AM | Updated on Feb 10 2026 7:55 AM

నేడు

నేడు పోలమాంబ అమ్మవారి మూడో జాతర

నేడు పోలమాంబ అమ్మవారి మూడో జాతర వెట్టిచాకిరీ లేని సమాజ నిర్మాణమే లక్ష్యం ● కలెక్టర్‌ ఎన్‌.ప్రభాకరరెడ్డి

మక్కువ: ఉత్తరాంధ్రుల ఇలవేల్పు శంబరపోలమాంబ అమ్మవారి మూడోజాతర నేడు జరగనుంది. జాతరకొచ్చే భక్తుల సౌకర్యార్థం ఈవో బి.శ్రీనివాస్‌, ట్రస్ట్‌బోర్డు సభ్యుల ఆధ్వర్యంలో ఏర్పా ట్లు పూర్తి చేశారు. జాతరలో భక్తుల అవసరా ర్థం 10వేల లడ్డూప్రసాదాన్ని దేవాదాయశాఖ తయారు చేయించింది. క్యూల వద్ద చిన్న పిల్లలకు పాలు, తాగునీరు సరఫరా చేయనున్నట్లు ఈవో తెలిపారు. అవసరమైన మేరకు పులిహో ర భక్తులకు అందించనున్నట్లు ఈవో తెలిపా రు. జాతరకొచ్చే భక్తులకు సేవలందించేందు కు 30మంది దేవాదాయశాఖ సిబ్బంది శంబర గ్రామానికి చేరుకున్నారు. జాతరలో 140మంది పోలీస్‌ సిబ్బంది బందోబస్తు విధులు నిర్వహించనున్నట్లు సీఐ రామకృష్ణ తెలిపారు.

పార్వతీపురం: వెట్టిచాకిరీ లేని సమాజ నిర్మాణ మే మనందరి లక్ష్యం కావాలని అందుకు ప్రజ లందరూ భాగస్వాములు కావాలని కలెక్టర్‌ డా.ఎన్‌.ప్రభాకరరెడ్డి పిలుపునిచ్చారు. ఈ మేర కు సోమవారం వెట్టిచాకిరీ వ్యవస్థ నిర్మూలన దినోత్సవం సందర్భంగా కార్మికశాఖ ఆధ్వర్యంలో నిర్వహించిన అవగాహన ర్యాలీని ఆయన ప్రారంభించి పోస్టర్లను, కరపత్రాలను విడుద ల చేశారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ ఎవరినైనా బలవంతంగా పనిలో ఉంచుకోవడం, తక్కువ వేతనంతో వెట్టిచాకిరీ చేయించుకోవ డం చట్టరీత్యా నేరమన్నారు. కార్మికుల సంక్షే మం కోసం ప్రభుత్వం అనేక సంక్షేమ పథకా లు, పునరావాస పథకాలను అమలు చేస్తుంద ని చెప్పారు. కార్యక్రమంలో జాయింట్‌ కలెక్టర్‌ సి.యశ్వంత్‌కుమార్‌రెడ్డి, ఎస్పీ మాధవరెడ్డి, సహాయ కార్మిక కమిషనర్‌ పి.సూర్ణ, మున్సిప ల్‌ కమిషనర్‌ డా.పావనితో పాటు అధికారులు, ఎన్‌జీఓలు తదితరులు పాల్గొన్నారు.

పీఎంజేవై కార్డులు తీసుకోవాలి

విజయనగరం ఫోర్ట్‌: జిల్లాలో 70 సంవత్సరాలు, అంతకంటే ఎక్కువ వయసు పైడిన ప్రతి ఒక్కరూ పీఎంజేవై, పీఎంవీవీవై కార్డులు తీసుకోవాలని ఆరోగ్యశ్రీ (ఎన్‌టీఆర్‌వైద్య సేవ) జిల్లా కో ఆర్డినేటర్‌ సోమవారం ఒక ప్రకటనలో తెలిపారు. ప్రాథమిక ఆరోగ్య కేంద్రం వైద్యాధికారులు, ఏఎన్‌ఎం, ఎంఎల్‌హెచ్‌పీల ఆధ్వర్యంలో కార్డులు తీసుకోవాలన్నారు.

నేడు పోలమాంబ  అమ్మవారి మూడో జాతర1
1/1

నేడు పోలమాంబ అమ్మవారి మూడో జాతర

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement