ఆలయ ప్రాంగణంలోని ఆక్రమణలు తొలగించాలి
గరుగుబిల్లి: తోటపల్లి వేంకటేశ్వర స్వామి, కోదండరామ స్వామి ఆలయ ప్రాంగణంలో రహదారికి ఇరువైపులా ఉన్న ఆక్రమణలను తొలగించాలని కలెక్టర్ డా.ఎన్.ప్రభాకరరెడ్డి అధికారులు, దేవాదాయశాఖ కమిటీని ఆదేశించారు. ఆదివారం మండలంలోని తోటపల్లిలోని వేంకటేశ్వరస్వామి ఆలయాన్ని సందర్శించారు. ఈ సందర్భంగా ఆలయ ప్రాంగణంలో పర్యావరణ పరిరక్షణకు, ఆలయ ప్రాంగణం సర్వాంగ సుందరంగా ఉండేందుకు మొక్కలు నాటించాలని సూచించారు. భక్తులకు మెరుగైన సౌకర్యాలను కల్పించేందుకు చర్యలు చేపట్టాలని కమిటీ సభ్యులకు సూచించారు. ఈ సందర్భంగా ఆలయ చైర్మన్ ఎం.పకీరునాయుడు కలెక్టర్ ప్రభాకర్ రెడ్డికి వేంకటేశ్వరస్వామి చిత్రపటాన్ని బహూకరించారు. ఈయనతోపాటు ఈఓ బి. శ్రీనివాస్, టీటీడీఎస్ కమిటీ సభ్యులు డి. పారినాయుడు, ఎం.సింహాచలం నాయుడు, ఎస్‌ఐ ఫక్రూద్దీన్ ఉన్నారు.


