22 నుంచి కానిస్టేబుల్స్‌కు శిక్షణ ప్రారంభం
విజయనగరం క్రైమ్: ఈ నెల 22 వ తేదీ నుంచి కానిస్టేబుల్స్ అభ్యర్థుల శిక్షణ ప్రారంభమవుతుందని ఎస్పీ దామోదర్ గురువారం తెలిపారు. ఉమ్మడి విజయనగరం జిల్లాలో కానిస్టేబుల్స్‌గా ఎంపికై న 133 మంది పురుష, మహిళా అభ్యర్థులు ఈ నెల 20 వతేదీన జిల్లా పోలీసు కార్యాలయం వద్ద ఉదయం 8గంటలకు హాజరు కావాలని సూచించారు. తొమ్మిది నెలల పాటు కానిస్టేబుల్స్‌కు శిక్షణ ఉంటుందన్నారు. కానిస్టేబుల్స్‌గా ఎంపికై న పురుష, మహిళా అభ్యర్థులు తొమ్మిది నెలల పాటు శిక్షణలో ఉండేందుకు లగేజీతో హాజరు కావాలని సూచించారు. శిక్షణ నిమిత్త పురుష అభ్యర్థులను చిత్తూరు పీటీసీకి, మహిళా అభ్యర్థులను ఒంగోలు పీటీసీకి పంపుతామని ఎస్పీ తెలిపారు. అభ్యర్థులు తమ వెంట విలువైన వస్తువులను తీసుకురాకూడదని, శిక్షణ కేంద్రానికి అభ్యర్థుల వెంట బంధువులను అనుమతించరని ఎస్పీ ఏఆర్.దామోదర్ స్పష్టం చేశారు.
ఎస్పీ దామోదర్
అభ్యర్థులు తీసుకురావాల్సిన పత్రాలు
5 పాస్‌పోర్ట్ సైజ్ కలర్ ఫొటోలు
2 స్టాంప్ సైజ్ కలర్ ఫొటోలు
ఒరిజినల్ సర్టిఫికెట్లు
రూ.100/ నాన్ జ్యుడిషియల్ బాండ్ పేపర్
2 బ్లాంకెట్స్
రూ.10,000లు తిరిగి ఇవ్వబడే కాషన్ డిపాజిట్, మెస్ చార్జీల కోసం తీసుకుని రావాలని ఎస్పీ దామోదర్ స్పష్టం చేశారు.


