రూ.283 కోట్ల సీ్త్రనిధి రుణ లక్ష్యం
రామభద్రపురం: జిల్లాలో ఈ ఏడాది రూ.283 కోట్లు సీ్త్రనిధి రుణ లక్ష్యమని సీ్త్రనిధి ఏజీఎం వై.చిట్టిబాబు అన్నారు. ఈ మేరకు రామభద్రపురంలోని వెలుగు కార్యాలయాన్ని గురువారం ఆయన సందర్శించి సిబ్బందితో సమీక్ష నిర్వహించి సీ్త్రనిధి రుణ వసూళ్లను వేగవంతం చేయాలని సూచించారు. ఈ సందర్భంగా ఆయన విలేకరులతో మాట్లాడుతూ ఈ ఏడాది ఏప్రిల్ నుంచి ఇప్పటివరకు రూ.193 కోట్లు రుణాల వసూలు అయిందన్నారు. సీ్త్రనిధి రుణం తీసుకోవడం వల్ల కలిగే ప్రయోజనాలపై మహిళలకు అవగాహన కల్పిస్తున్నామని తెలిపారు. బ్యాంకులో రుణం తీసుకుంటే డాక్యుమెంట్ ఫీజు, ప్రాసెసింగ్ ఫీజు, ఇన్‌స్పెక్షన్ ఫీజులు వంటి అదనపు వసూళ్లు ఉంటాయని, సీ్త్రనిధి రుణం తీసుకుంటే అదనపు వసూళ్లు ఉండవన్నారు.అలాగే నూటికి నెలకు 92 పైసలు మాత్రమే వడ్డీ పడుతుందని చెప్పారు. రుణం తీసుకున్న సభ్యులు సకాలంలో సక్రమంగా వాయిదాలు చెల్లిస్తే అదనపు వడ్డీ ఉండదన్నారు. దరఖాస్తు చేసుకున్న 48 గంటల్లో నగదు సభ్యుల ఖాతాలో పడుతుందని చెప్పారు. గ్రూప్‌లో ఒక్క సభ్యురాలికై నా రుణం ఇస్తామని, ఆ రుణంతో చిన్న చిన్న వ్యాపారాలు చేసుకుని ఆర్థికంగా బలోపేతం కావాలని సూచించారు. కార్యక్రమంలో సీ్త్రనిధి మేనేజర్ వై ఎర్రినాయుడు, సీసీలు సింగరాజు తదితరులు పాల్గొన్నారు.
సీ్త్రనిధి ఏజీఎం వై చిట్టిబాబు


