జనకోటి సమరం
న్యూస్‌రీల్
శుక్రవారం శ్రీ 19 శ్రీ డిసెంబర్ శ్రీ 2025
● స్వచ్ఛందంగా తరలివచ్చి సంతకాలు చేసిన విద్యార్థులు, యువత, పెద్దలు, మహిళలు ● పీపీపీ విధానం రద్దు చేయాలంటూ కోటి సంతకాల సేకరణకు పిలుపు నిచ్చిన వైఎస్సార్‌సీపీ అధినేత ● స్పందించిన రాష్ట్ర ప్రజలు
సాక్షి నెట్‌వర్క్:
చినుకు చినుకు వానగా మారి..వాన వరదై..వరద తుఫాన్‌గా రూపాంతరం చెందినట్లు కోటి సంతకాల సేకరణ ఉద్యమం నిరూపించింది. కలంతో చేసిన సంతకానికి తిరుగులేదని నిరూపించారు రాష్ట్రంలోని విద్యార్థులు, యువత, పెద్దలు, మహిళలు, మేధావులు. గత ప్రభుత్వంలో ముఖ్యమంత్రి వైఎస్ జగన్‌మోహన్ రెడ్డి హయాంలో రాష్ట్రానికి 17 వైద్య కళాలలు మంజూరు చేయించి వాటి నిర్మాణం చేపట్టి 5 కళాశాలలను పూర్తి చేశారు. పూర్తి చేసిన కళాశాలల్లో తరగతులు కూడా జరుగుతున్నాయి. అయితే మిగిలిన వైద్య కళాశాలల నిర్మాణం పూర్తి చేయాల్సిన కూటమి ప్రభుత్వం వాటిని పీపీపీ పద్ధతిలో కార్పొరేట్లకు అప్పగించేందుకు చేస్తున్న ప్రయత్నాన్ని మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి వ్యతిరేకించారు. ఈ నేపథ్యంలో రాష్ట్రంలో కోటి సంతకాల సేకరణ ఉద్యమానికి పిలుపునిచ్చారు. ఈ క్రమంలో రాష్ట్రవ్యాప్తంగా వైఎస్సార్‌సీపీ నాయకులు, కార్యకర్తలు ప్రజాక్షేత్రంలో అడుగుపెట్టి కోటి సంతకాల సేకరణ ఉద్యమాన్ని విజయవంతం చేశారు. కోటి సంతకాల సేకరణ ఉద్యమానికి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి పిలుపునిచ్చిన నేపథ్యంలో రాష్ట్రవ్యాప్తంగా విద్యార్థులు, యువత, పెద్దలు, మేధావులు, మహిళలు స్వచ్ఛందంగా తరలివచ్చి మెడికల్ కళాశాలల ప్రైవేటీకరణపై తమ అభిప్రాయాన్ని కుండబద్దలు కొట్టారు.
జనకోటి సమరం


