శ్మశానం కబ్జా!
సాక్షి, పార్వతీపురం మన్యం: సీతంపేట మండలం కొండపల్లి గ్రామంలో తరతరాలుగా గిరిజనులు ఉపయోగించుకుంటున్న శ్మశానవాటికను ఓ వ్యక్తి కబ్జా చేస్తున్నాడు. కొద్దిరోజులుగా జేసీబీతో చదును పనులు సైతం చేయిస్తున్నాడు. ఆర్‌వోఎఫ్‌ఆర్ పరిధిలోని ఈ స్థలాన్ని ఎలా ఆక్రమించుకుంటారని గిరిజనులు ప్రశ్నిస్తే.. ‘మీకు దిక్కున్నచోట చెప్పుకోండ’ని బెదిరిస్తున్నట్లు గ్రామస్తులు వాపోతున్నారు. ‘అధికారులకు చెప్పుకున్నాం. ఎమ్మెల్యేకు మొరపెట్టుకున్నాం. ఎక్కడా న్యాయం జరగడం లేదని’.. వారంతా గురువారం పార్వతీపురం కలెక్టరేట్‌కు వచ్చి నిరసన వ్యక్తం చేశారు.


