●కళాశాలలు పూర్తి చేయాల్సిన బాధ్యత ప్రభుత్వానిదే
ప్రజలతో ఎన్నికై న సర్కారు ప్రభుత్వ ఆస్తులను కాపాడాల్సిందిపోయి ప్రైవేట్ శక్తులకు దోచిపెట్టేలా వ్యవహరించడం సరికాదు. సామాన్యులకు వైద్యవిద్యను అందుబాటులోకి తేవడంతో పాటు పేదప్రజలకు ఉచిత వైద్యం అందించేందుకు గత వైఎస్సార్‌సీపీ ప్రభుత్వం తీసుకువచ్చిన 17 ప్రభుత్వ వైద్య కళాశాలలను పూర్తి చేయాల్సిన బాధ్యత కూటమి సర్కారుపై ఉంది. పీపీపీ విధానం పేరిట తీసుకున్న నిర్ణయం సహేతుకం కాదని ప్రజలే తమ సంతకాల ద్వారా తెలియజేశారు. ఈ క్రమంలో ప్రజాభిప్రాయాన్ని ప్రభుత్వం గౌరవించాలి. కేవలం భేషజాలకు పోయి ప్రజలకు అందాల్సిన ఉచిత వైద్యసేవలను, భవిష్యత్తు తరాలకు అండగా నిలవాల్సిన వైద్యవిద్యార్థులకు అన్యాయం చేసే యత్నం మానుకోవాలి. –తిర్లంగి ఉపేంద్రకుమార్, లుంబూరు, పాలకొండ


