క్వారీ అనుమతులపై ప్రజాభిప్రాయం
పాచిపెంట: మండలంలోని మంచాడవలస సమీపంలో సర్వే నంబర్ 531లో గల సుమారు 15 హెక్టార్ల క్వారీ అనుమతులకు సంబంధించి గురువారం పనుకువలస వద్ద పర్యావరణ ప్రజాభిప్రాయ సేకరణ నిర్వహించారు. సబ్‌కలెక్టర్ యశ్వంత్‌కుమార్ రెడ్డి పర్యావరణ శాఖ అధికారులతో పాటు రెవెన్యూ అధికారులు హాజరై ప్రజాభిప్రాయ సేకరణ చేపట్టారు. ఈ మేరకు మెజారిటీ ప్రజలు క్వారీ ఏర్పాట వల్ల ఎటువంటి అభ్యంతరం లేదని తెలిపారు. స్టోన్ క్రషర్ క్వారీ ఏర్పాటు చేయడం వల్ల చుట్టుపక్కల ప్రాంతాల ప్రజలకు ఉపాధి లభించడంతో పాటు ఇళ్ల నిర్మాణాలు, రోడ్లు, వివిధ అభివృద్ధి పనులకు స్టోనన్స్ అందుబాటులో ఉంటాయని జీగిరాం సర్పంచ్‌తో పాటు పణుకువలస సర్పంచ్ సీతారాం ఎంపీటీసీ లక్ష్మి తమ అభిప్రాయాలను వెల్లడించారు. ముఖ్యంగా క్వారీ ఏర్పాటు చేయడం వల్ల పర్యావరణం దెబ్బతినకుండా చుట్టూ మొక్కలు నాటడం వంటి పర్యావరణ పరిరక్షణ చర్యలను క్వారీ నిర్వాహకులు తీసుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉందని పలు స్వచ్ఛంద సేవా సంస్థ ప్రతినిధులు తెలిపారు. క్వారీకి అతి సమీపంలో గల శివాలయం దెబ్బతినకుండా చూడాలని చుట్టుపక్కల ప్రాంతాల రైతులు పంటలు నాశనం కాకుండా చూడాలని మంచాడవలస గ్రామస్తులు కోరారు. క్వారీ అనుమతుల కోసం దరఖాస్తు చేసుకున్న నవదుర్గ మైనింగ్ మేనేజింగ్ నిర్వాహకుడు నెక్కంటి శ్రీనివాసరావు మాట్లాడుతూ నిబంధనల మేరకు ప్రజలకు ఇబ్బందులు తలెత్తకుండా క్వారీ నిర్వహణ చేపట్టేందుకు అనుమతులు ఇప్పించాలని కోరారు. ఈ సందర్భంగా జాయింట్ కలెక్టర్ యశ్వంత్ కుమార్ రెడ్డి మాట్లాడుతూ ఈరోజు నిర్వహించిన ప్రజాభిప్రాయ సేకరణ విషయాన్ని ప్రభుత్వం దష్టికి తీసుకువెళ్లి పై స్థాయి కమిటీ నిర్ణయాల మేరకు క్వారీ అనుమతులపై నిర్ణయం తీసుకోనున్నట్లు తెలిపారు. పర్యావరణ శాఖ ఇంజినీర్ అరుణశ్రీ తహసీల్దార్ రవి ఎంపీడీఓ బీవీజే పాత్రో తదితరులు పాల్గొన్నారు.
క్వారీ అనుమతులపై ప్రజాభిప్రాయం


