దాచేస్తే దాగుతాయా.. మరణాలు ఆగుతాయా!
● ఏం జరుగుతోంది.. ఆశ్రమాల్లో? ● ముస్తాబులు సరే.. పిల్లల ఆరోగ్యంపై ఏం చెబుతాం!
● ఇటీవల జిల్లాలోని ఓ ఆశ్రమ పాఠశాలలో చదు వుతున్న విద్యార్థిని ఆత్మహత్యాయత్నానికి పాల్పడింది. కారణాలేమైనా.. విషయాన్ని బయ టకు రాకుండా తీవ్ర ప్రయత్నాలు జరిగాయి.
● కొద్దిరోజుల కిందట గుమ్మలక్ష్మీపురం మండలం దొరజమ్ము ఆశ్రమ పాఠశాల పదో తరగతి విద్యార్థి మరణించాడు. విషయం చాలా రోజుల వరకూ బయటకు రాలేదు. చేతికి అందొచ్చిన కుమారుడిని కోల్పోయి పుట్టెడు దుఃఖంలో ఉన్న తల్లిదండ్రుల నుంచి పాఠశాల ఉపాధ్యాయులు.. విద్యార్థి మరణంతో తమకేమీ సంబంధం లేదని ఏకంగా పూచీపత్రం రాయించుకోవడం విమర్శలకు తావిస్తోంది.
● విద్యార్థుల మరణాలు సంభవిస్తే సహించేది లేదని.. సిబ్బందిని సస్పెండ్ చేస్తామని ముఖ్యమంత్రి చంద్రబాబు హెచ్చరించారు. ప్రతి నెలలోనూ ఒకట్రెండు మరణాలు సంభవిస్తున్న జిల్లాలో ఎంతమంది సిబ్బందిని సస్పెండ్ చేయాలి.. ఎందరిని బాధ్యులు చేస్తారన్న గిరిజన సంఘాల ప్రశ్నకు సమాధానం లేదు.
● జిల్లాలోని ప్రభుత్వ పాఠశాలల్లో విద్యార్థుల ఆరోగ్యం దృష్ట్యా ముస్తాబు కార్యక్రమాన్ని చేపడుతున్నారు. విద్యార్థుల ఆరోగ్య రక్షణ.. క్రమశిక్షణ, శుభ్రత అలవాటు చేయాలన్న ఉద్దేశంతో ఈ కార్యక్రమం నిర్వహిస్తున్నట్లు చెబుతున్నారు. కోట్లాది రూపాయలు నిధులు ఖర్చు చేసి పౌష్టికాహారం అందిస్తున్నా.. అది సక్రమంగా అందకనే రక్తహీనత వంటి కేసులు వెలుగు చూస్తున్నాయి. ఆశ్రమ పాఠశాలల్లో చిన్నపాటి జ్వరానికి వైద్యం అందించలేని పరిస్థితుల్లో విద్యార్థుల మరణాలు సంభవిస్తున్నాయి. వీటిని సరి చేయలేకపోతున్న యంత్రాంగం.. ఎన్ని ముస్తాబులు చేసినా ఏం లాభం? అన్నది గిరిజన సంఘాల వాదన


