విజయవంతం
ప్రభుత్వ వైద్యం..సామాన్యుడికి ప్రాణవాయువు వంటిది. కానీ నేడు చంద్రబాబు ప్రభుత్వం పీపీపీ విధానం పేరుతో ప్రభుత్వ వైద్య కళాశాలలను కార్పొరేట్ శక్తులకు కట్టబెట్టాలని చూడడం శోచనీయం. ప్రభుత్వ రంగంలో ఉండాల్సిన వైద్య విద్యను ప్రైవేటు గడప దాటించడం అంటే, పేద విద్యార్థుల కలలను చిదిమేయడమే. ఫీజుల భారం మోయలేక మధ్యతరగతి విద్యార్థులు వైద్య విద్యకు స్వస్తి చెప్పాల్సి వస్తుంది. లాభాపేక్షే పరమావధిగా సాగే ప్రైవేటు యాజమాన్యాల చేతుల్లో విద్యార్థుల భవితవ్యం చిక్కుకుంటే, అది విద్యార్థి లో కానికే తీరని నష్టం. ముఖ్యమంత్రి చంద్రబాబు ఈ నిర్ణయాన్ని వెనక్కి తీసుకుని, వైద్య విద్యను ’ప్రజాహితం’ గానే ఉంచాలని, ’లాభసాటి’ వ్యాపారంగా మార్చవద్దని కోరుతున్నాం.
–ఎల్. మణి, డిగ్రీ పట్టభద్రురాలు, పార్వతీపురం


