సచివాలయ సిబ్బంది నిర్వాకం
రెండేళ్లుగా అందని రేషన్ సరుకులు
మహిళ బతికుండగానే రద్దయిన రేషన్‌కార్డు
భర్త చనిపోతే..భార్య కూడా
చనిపోయినట్లు ఆన్‌లైన్‌లో నమోదు
వీరఘట్టం: మండలంలోని కంబరవలస గ్రామానికి చెందిన రెట్టి కమల భర్త కామయ్య 2.7.2023న మృతి చెందాడు. వారి రేషన్‌కార్డులో భార్యాభర్తలు మాత్రమే ఉన్నారు. వారికి ప్రతి నెలా పది కిలోల బియ్యం వస్తున్నాయి. సచివాలయ సిబ్బంది కామయ్య చనిపోయినట్లు సివిల్ సప్లయిస్ పోర్టల్‌లో నమోదు చేశారు. దీంతో వారి రేషన్‌కార్డు రద్దయింది. 1.8.2023 నుంచి కమలకు రేషన్ సరుకులు నిలిచిపోయాయి. కొత్త రేషన్‌కార్డు కోసం ఆమె దరఖాస్తు చేస్తే ఆమె ఆధార్‌కార్డు నంబర్ ఎంటర్ చేయగానే డెత్ అని ఆన్‌లైన్‌లో చూపిస్తోంది. తన భర్తతో పాటు తాను కూడా డెత్ అని నమోదు చేయడంతోనే తన రేషన్‌కార్డు రద్దయిందని కమల వాపోతోంది. తాను బతికుండగానే తన రేషన్‌కార్డు రద్దు చేయడంపై ఆందోళన వ్యక్తం చేస్తోంది. ఒంటరి మహిళను అయిన తనకు అంత్యోదయ కార్డు మంజూరు చేసి 35 కిలోల బియ్యం ఇప్పించాలని ఆమె కోరుతోంది.
సచివాలయ సిబ్బంది నిర్వాకం


