లగ్జరీ బస్సును ఢీకొట్టిన లారీ
గజపతినగరం: మండలంలోని మరుపల్లి గ్రామం జంక్షన్ వద్ద లగ్జరీ ఆర్టీసీ ఎక్స్‌ప్రెస్ బస్సును వెనుక నుంచి లారీ ఢీకొట్టడంతో జరిగిన ప్రమాదంలో ఐదుగురు వ్యక్తులు గాయాలపాలయ్యారు. మంగళవారం రాత్రి జరిగిన ఈ సంఘటనపై పోలీసులు, స్థానికులు తెలిపిన వివరాల ప్రకారం విజయనగరం నుంచి గజపతినగరం మీదుగా ప్రయాణిస్తూ మరుపల్లి గ్రామం సమీపంలో ఒక ఆర్టీసి పల్లె వెలుగు బస్సు ఆగి ఉంది. దాని వెనుక వస్తున్న వస్తున్న లగ్జరీ ఆర్టీసీ ఎక్స్‌ప్రెస్‌బస్సు ఆగి కొంతసమయం తరువాత ఆగి ఉన్న పాసింజర్ బస్సును తప్పించి కుడివైపు వెళ్లేందుకు సిద్ధమవుతున్న సమయంలో వెనుక నుంచి లగ్జరీ ఆర్టీసీ బస్సును లారీ డ్రైవర్ బలంగా ఢీకొట్టాడు.ఆతరువాత బైక్‌ను కూడా లారీ డ్రైవర్ ఢీకొట్టాడు. అయితే అదృష్టవశాత్తు ఎవరికీ ఎటువంటి ప్రాణనష్టం జరగలేదు. ఈ ప్రమాదంలో గాయాలపాలయిన డి.అప్పలనాయుడు(రేగిడి),కె.సూర్యప్రకాష్ (మిర్తివలస),పి.శ్రీను(గజపతినగరం మండలం మరుపల్లిగ్రామం),కె.మురళీకృష్ణ(గజపతినగరం మండలం మరుపల్లి గ్రామం),ఎన్.అప్పారావు(గంట్యాడ మండలం నరవ గ్రామం)లను గజపతినగరం ఏరియా ఆస్పత్రికి తరలించి వైద్య సేవలు అందించారు.బస్సు డ్రైవర్ సూర్యప్రకాష్ ఫిర్యాదు మేరకు ఎస్సై కె.కిరణ్ కుమార్ నాయుడు లారీని అదుపులోకి తీసుకుని కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.
ఐదుగురికి గాయాలు


