క్లాట్‌లో బొబ్బిలి కుర్రాడి ప్రతిభ | - | Sakshi
Sakshi News home page

క్లాట్‌లో బొబ్బిలి కుర్రాడి ప్రతిభ

Dec 18 2025 7:35 AM | Updated on Dec 18 2025 7:35 AM

క్లాట

క్లాట్‌లో బొబ్బిలి కుర్రాడి ప్రతిభ

పశుగ్రాస కేంద్రాల ఏర్పాటుకు ప్రతిపాదన జాతీయ స్థాయి క్విజ్‌ పోటీలకు వెటర్నరీ విద్యార్థులు

బొబ్బిలి: పట్టణానికి చెందిన వేమిరెడ్డి నితిన్‌ చంద్ర మంగళవారం విడుదలైన క్లాట్‌ (కామన్‌ లా అడ్మిషన్‌ టెస్ట్‌–26) ఫలితాల్లో జాతీ య స్థాయిలో 90వ ర్యాంకు సాధించాడు. ఓబీసీలో 5వ ర్యాంకును సొంతం చేసుకున్నాడు. క్లాట్‌లో కుమారుడు ప్రతిభ చూపడంతో తల్లిదండ్రులు శ్యామల, బాబూరావు సంతోషం వ్యక్తం చేశా రు. పట్టణ వాసులు, విద్యావేత్తలు, న్యాయవాదులు నితిన్‌చంద్రను అభినందించారు. అంతర్జాతీయ గుర్తింపు పొందిన బెంగళూరు లా యూనివర్సిటీలో మాస్టర్స్‌ లా చేసి ప్రజలకు న్యాయ సేవలందించడమే ఆశయమని నితిన్‌ తెలిపాడు.

విజయనగరం అర్బన్‌: ప్రతి గ్రామంలో పశుగ్రాస కేంద్రాలను ఏర్పాటు చేయడం వల్ల పాడి పరిశ్రమను మరింత అభివృద్ధి చేయవచ్చని కలెక్టర్‌ ఎస్‌.రాంసుందర్‌రెడ్డి పేర్కొన్నారు. రాష్ట్ర సచివాలయంలో బుధవారం ప్రారంభమైన ముఖ్యమంత్రితో కలెక్టర్ల సమావేశంలో ఆయన ఈ ప్రతిపాదన తీసుకొచ్చారు. ఈ సందర్భంగా కలెక్టర్‌ మాట్లాడుతూ గ్రామీణ ప్రాంతాల్లో పశుగ్రాస కేంద్రాల ఏర్పాటువల్ల పాలఉత్పత్తి పెరగడంతో రైతులు, పాడి రైతుల ఆదాయం మెరుగుపడుతుందన్నారు. గ్రామీణ ప్రజల ఆర్థిక పరిస్థితి బలోపేతం అవుతుందని తెలిపారు.

చీపురుపల్లిరూరల్‌(గరివిడి): గరివిడి శ్రీ వెంకటేశ్వర వెటర్నరీ కళాశాలకు చెందిన విద్యార్థులు క్విజ్‌ పోటీల్లో ప్రతిభ చూపారు. సొసైటీ ఆఫ్‌ యానిమల్‌ ఫిజియాలజిస్టు ఆఫ్‌ ఇండియా ఆధ్వ ర్యంలో హైదరాబాద్‌లో నిర్వహించిన దక్షిణ భారత క్విజ్‌ పోటీల్లో కళాశాలలో ద్వితీయ సంవత్సరం చదువుతున్న బి.జ్ఞాన సంధ్యారాణి, తృతీయ సంవత్సరం చదువుతున్న వి.సంజనశర్మ విజేతలుగా నిలిచి జాతీయస్థాయి పోటీలకు ఎంపికయ్యారు. విజేతలను కళాశాలలో బుధవారం నిర్వహించిన అభినందన సభలో అసోసియేట్‌ డీన్‌ మక్కేన శ్రీను అభినందించి దుశ్శాలువతో సత్కరించారు. క్విజ్‌ పోటీలు విద్యార్థుల మేధోశక్తికి దోహదపడతాయన్నారు. జాతీయ స్థాయి పోటీల్లో రాణించి కళాశాలకు పేరు తీసుకురావా లని ఆకాంక్షించారు. కార్యక్రమంలో విద్యార్థి వ్యవహారాల అధికారి డా.వై.ఆర్‌.అంబేడ్కర్‌, అకడమిక్‌ అధికారి దీపిక, డిపార్ట్‌మెంట్‌ హెడ్‌ టి.ప్రసాదరావు, గంగునాయుడు, రాజీవ్‌, విద్యార్థులు పాల్గొన్నారు.

యూరియా కోసం..

క్లాట్‌లో బొబ్బిలి కుర్రాడి ప్రతిభ 1
1/2

క్లాట్‌లో బొబ్బిలి కుర్రాడి ప్రతిభ

క్లాట్‌లో బొబ్బిలి కుర్రాడి ప్రతిభ 2
2/2

క్లాట్‌లో బొబ్బిలి కుర్రాడి ప్రతిభ

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement