ప్రమాదకరంగా జలాశయంలో నీటి నిల్వ
తోటపల్లి జలాశయంలో ప్రస్తుతం నీటి నిల్వలు ప్రమాదకర స్థాయికి చేరుకుంటున్నాయని, రానున్న వేసవిలో మరిన్ని నీటి ఇబ్బందులు తప్పవని అధికారులు పేర్కొంటున్నారు. జలాశయం ద్వారా ప్రతీ ఏటా ఖరీఫ్‌లో పాత ఆయకట్టులోని 64 వేల ఎకరాలకు, కుడి ప్రధాన కాలువలో 1.35 లక్షల ఎకరాలకు నీరందిస్తున్నారు. వీటితో పాటు పార్వతీపురం జిల్లా కేంద్రంలోని రక్షిత మంచినీటి పథకానికి కూడా తోటపల్లి నీరే అందిస్తున్నారు. వర్షాకాలం, శీతాకాలం మినహాయిస్తే డిసెంబర్ నుంచి వచ్చే జూన్ వరకు ఇన్‌ప్లోస్ ఉండవు. ప్రస్తుతం నీటి నిల్వ 2.1 టీఎంసీలు ఉంది. పాత కుడి, ఎడమ కాలువల నుంచి గత నెల రోజులుగా 0.66 టీఎంసీల నీరు వృథాగా పోతోంది. ఈ నీటి వృథాను తక్షణమే అరికట్టకపోతే మరో రెండు నెలల్లో ప్రాజెక్టులో నీటి నిల్వ ప్రమాదకర స్థితికి చేరే అవకాశం ఉందని సర్వత్రా ఆందోళన చెందుతున్నారు.


