మేము నేరస్తులం కాదు బాబూ..
బలిజిపేట/సీతంపేట: చంద్రబాబు ప్రభుత్వ నిరంకుశత్వ పాలనపై అంగన్వాడీలు అక్కసు వెళ్లగక్కారు. ఎన్నికల్లో ఇచ్చిన హామీలు, న్యాయమైన డిమాండ్లు పరిష్కరించాలని శాంతియుతంగా ఆందోళన చేస్తున్న అంగ్‌వాడీ సిబ్బందిని పోలీసులతో అడ్డుకోవడం, బస్సుల్లోంచి బలవంతంగా మధ్యదారిలో దించేయడంపై మండిపడ్డారు. మేము నేరస్తులం కాదు ‘బాబూ’... ఓటేసి గెలిపించిన అంగన్‌వాడీ ఉద్యోగులం... హామీలు అమలుచేయమంటే మీకు శత్రువులుగా కనిపిస్తున్నామంటూ సీతంపేటలోని కుశిమి కూడలిలో రోడ్డుపైనే బైఠాయించి నిరసన తెలిపారు. జిల్లా కేంద్రంలో జరిగే కార్యక్రమానికి వెళ్తున్నవారిని బస్సు ఆపి నడిరోడ్డుమీద దించివేయడం అమానుషమ ని, ఇంతవరకు ఇటువంటి దుశ్చర్యలు చూడలే దని సీఐటీయూ జిల్లా ప్రధానకార్యదర్శి మన్మథరావు, ఎ.భాస్కరరావు అన్నారు. ప్రభుత్వ తీరును ఖండించారు. అణచివేతతో ఉద్యమాలను ఆపలేరని స్పష్టంచేశారు.
మేము నేరస్తులం కాదు బాబూ..


