జనకోటి వ్యతిరేకత
చంద్రబాబు ప్రభుత్వంపై పెల్లుబికిన ప్రజాగ్రహం ప్రభుత్వ వైద్యకళాశాలల ప్రైవేటీకరణపై ప్రజావ్యతిరేకత వైఎస్సార్‌సీపీ చేపట్టిన సంతకాల ఉద్యమానికి అనూహ్యస్పందన సంతకాల ప్రతులను ఊరేగింపుగా జిల్లా కేంద్రానికి తరలింపు
న్యూస్‌రీల్
–8లో
వైద్యకళాశాలల ప్రైవేటీకరణపై..
‘వసతి’ గృహాలకు గ్రహణం
వసతి గృహాలు సమస్యల సుడిగుండంలో చిక్కుకున్నాయి. పేద విద్యార్థులకు ఆసరాగా నిలవాల్సిన ఆశ్రమ పాఠశాలలు, పాలకుల నిర్లక్ష్యంతో అవస్థల నిలయాలుగా మారుతున్నాయి.
సాక్షి, పార్వతీపురం మన్యం:
ప్రభుత్వ వైద్యకళాశాలల ప్రైవేటీకరణను వ్యతిరేకిస్తూ వైఎస్సార్ సీపీ చేపట్టిన కోటి సంతకా ల సేకరణ ఉద్యమానికి పార్వతీపురం మన్యం జిల్లాలో అనూహ్య స్పందన లభించింది. విద్యార్థు ల నుంచి వృద్ధుల వరకు స్వచ్ఛందంగా సంతకాలు చేశారు. ప్రైవేటీకరణపై వ్యతిరేకత తెలిపారు. చంద్రబాబు ప్రభుత్వం తీరుపై నిరసన తెలిపారు. జన‘కోటి’ సంతకాల ప్రతులను జిల్లాలోని నాలుగు నియోజకవర్గాల నుంచి బుధవారం ర్యాలీగా పార్వతీపురం మన్యం జిల్లా కేంద్రంలోని పార్టీ కార్యాలయానికి తీసుకొచ్చారు. కార్యక్రమంలో జిల్లాలోని అన్ని నియోజకవర్గాల సమన్వయకర్తలు, నియోజకవర్గ స్థాయి నాయకులు, ఎంపీపీలు, జెడ్పీటీసీ సభ్యులు, సర్పంచ్‌లు, ఎంపీటీసీ సభ్యులు, పార్టీ కార్యకర్తలు పాల్గొన్నారు.
మాజీ ముఖ్యమంత్రి, వైఎస్సార్‌సీపీ జాతీయ అధ్య క్షుడు వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి ఆదేశాల మేరకు ప్రభుత్వ మెడికల్ కాలేజీల ప్రైవేటీకరణకు వ్యతిరేకంగా కురుపాం నియోజకవర్గంలో చేపట్టిన కోటి సంతకాల సేకరణ విజయవంతంగా సాగింది. సేకరించిన 55 వేల సంతకాల ప్రతులను మాజీ డిప్యూ టీ సీఎం పాముల పుష్పశ్రీవాణి ఆధ్వర్యంలో పార్టీ నాయకులు, కార్యకర్తలు ర్యాలీగా పార్వతీపురంలోని పార్టీ కార్యాలయానికి తరలించారు. నిధులు లేక మెడికల్ కళాశాలలను చంద్రబాబు ప్రభుత్వం ప్రైవేటుపరం చేయడం సిగ్గుచేటన్నారు. కార్యక్రమంలో ఎంపీపీలు శెట్టి పద్మావతి, శెట్టి శ్యామల, దీనమయ, జెడ్పీటీసీ సభ్యులు సుజాత, శశికళ, ద్వారపురెడ్డి లక్ష్మి, మండంగి రాధిక, జెడ్పీ వైస్ చైర్మ న్ బాపూజీ నాయుడు, జిల్లా కో ఆప్షన్ సభ్యుడు షేక నిషార్ తదితరులు పాల్గొన్నారు.
ప్రభుత్వ వైద్య కళాశాలల ప్రైవేటీకరణను వ్యతిరేకి స్తూ పాలకొండలో చేపట్టిన కోటి సంతకాల ఉద్య మం విజయవంతమైంది. సంతకాల ప్రతులతో ఎమ్మెల్సీ పాలవలస విక్రాంత్, మాజీ ఎమ్మెల్యే విశ్వాసరాయి కళావతి సమక్షంలో పార్టీ నాయకు లు, కార్యకర్తలు పాలకొండలో భారీ ర్యాలీ నిర్వహించారు. చంద్రబాబు ప్రభుత్వ దుర్మార్గపు పాలనపై నిరసన తెలిపారు. వైద్యకళాశాలల ప్రైవేటీకరణ వల్ల కలిగే నష్టాలను వివరించారు. అనంతరం సంతకాల ప్రతులను ప్రత్యేక వాహనంలో జిల్లా కేంద్రంలోని పార్టీ కార్యాలయానికి చేర్చారు. కార్యక్రమంలో పార్టీ నాయకులు కణపాక సూర్యప్రకాష్, దమలపాటి వెంకటరమణనాయుడు, బోదెపు శ్రీనివాసరావు, బిడ్డిక ఆదినారాయణ, వెలమల మన్మథరావు తదితరులు పాల్గొన్నారు.
జనకోటి వ్యతిరేకత
జనకోటి వ్యతిరేకత
జనకోటి వ్యతిరేకత


