జీతాలేవి బాబూ..?
సాక్షి, పార్వతీపురం మన్యం:
చంద్రబాబు సర్కారులో ప్రభుత్వ ఉద్యోగుల కు నెలనెలా గండమే అవుతోంది. ఒకటో తేదీనే ఠంఛన్‌గా జీతాలు చెల్లిస్తామని ఊదరగొట్టిన చంద్రబా బు.. పదో తేదీ వచ్చినా ఉత్తిచేతులే చూపుతున్నా రు. ఓవైపు పండగ నెల వస్తోంది. డిసెంబర్ నెలలో ఇప్పటికీ సుమారు 14 శాఖల సిబ్బందికి జీతాలు జ మ కాలేదు. ఉద్యోగుల జేబులు ఖాళీ అయిపో యా యి. ఉన్నదంతా ఊడ్చేయడంతో బ్యాంకు ఖాతాలు జీరో బ్యాలెన్స్‌కు చేరుకున్నాయి. ఇంటి అవసరాల కు అప్పులు చేయాల్సిన పరిస్థితి ఎదుర్కొంటున్నా రు. గడువు దాటినా ఈఎంఐ మొత్తం కట్టకపోవడంతో అటు నుంచి వరుసగా ఫోన్లు మోగుతున్నాయి.
చేసింది సర్కారు కొలువే గానీ..
గత ఎన్నికలకు ముందు చంద్రబాబు నేతృత్వంలో ని కూటమి నేతలు ఉద్యోగులపై హామీల జల్లు కురి పించారు. పీఆర్‌సీ, పెండింగ్ డీఏలు అంటూ ఊద రగొట్టారు. ఉద్యోగులకు, పెన్షనర్లకు ప్రతి నెలా ఒకటో తేదీ నాటికే జీతాలు, పింఛన్లు జమ అవుతా యని చెప్పుకొచ్చారు. ఇప్పుడు మొత్తం రివర్స్ గేర్‌లో నడుస్తోంది. చేసింది సర్కారు కొలువే గానీ.. నెలయ్యే సరికి జీతం భరోసా లేదంటూ ప్రభుత్వ ఉద్యోగులు వాపోతున్నారు. ప్రతినెలా జీతాల కో సం కళ్లు కాయలు కాసేలా ఎదురుచూడాల్సి వస్తోందని ఆవేదన చెందుతున్నారు. జిల్లాలో రాష్ట్ర ప్రభు త్వ ఉద్యోగులు సుమారు 12,500 మంది, ఉపాధ్యాయులు 9,700 మంది, పోలీసులు 900 మంది వరకు ఉన్నారు. వీరు కాక.. కాంట్రాక్టు, అవుట్‌సోర్సింగ్ ఉద్యోగులు వందల సంఖ్యలో పనిచేస్తున్నా రు. ప్రస్తుతం డిసెంబర్ 11వ తేదీ వచ్చినప్పటికీ.. ఇరిగేషన్, పంచాయతీరాజ్, సంక్షేమ శాఖలు, వ్యవ సాయం, ప్రణాళికా విభాగం ఇలా దాదాపు 14 శాఖలపైగా ఉద్యోగులకు నేటికీ జీతాలు జమ కాలే దు. ఉపాధ్యాయులు, మెడికల్, పోలీసులకు మాత్ర మే జమ చేసినట్లు తెలుస్తోంది. ఒక్కొక్కరికీ ఒక్కో తేదీన ప్రభుత్వం చెల్లింపులు చేస్తోంది. దీంతో వారంతా ఎప్పటికప్పుడు తమ బ్యాంకు ఖాతాలను పరిశీలించుకుంటున్నారు.
నెలవారీ అవసరాలను తీర్చుకోలేక..
ఒకటో తేదీ నాటికి జీతాలు జమ చేస్తే.. ఉద్యోగులు తమ నెలవారీ అవసరాలను తీర్చుకుంటారు. ప్రస్తు తం పిల్లలకు చెల్లించాల్సిన ఫీజులు.. క్రిస్మస్, కొత్త
సంవత్సరం, సంక్రాంతి పండగలు ముందు ఉండడంతో మరింత ఆందోళన చెందుతున్నారు. పేరుకు రూ.వేలల్లో జీతాలైనా.. అధిక శాతం మంది మధ్య తరగతి ఉద్యోగులకు ఒకటో తేదీ వస్తే గుండె దడే. ఇంటి అద్దె, కరెంటు బిల్లు, పాలవాడు, కిరాణా వంటివే కాక.. ఈఎంఐలు, తీసుకున్న రుణాలకు వడ్డీ లు చెల్లించాలి. వీటికే ఖాతా ఖాళీ అయిపోతోంది. నెల మొత్తం గడవాలంటే.. మళ్లీ అప్పులు చేయా ల్సి వస్తోందని పలువురు ఉద్యోగులు వాపోతున్నారు. పండగ నెలలో ఇప్పటికీ జీతాలు రాకపోతే ఎలా తట్టుకోగలమని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.
రాష్ట్ర ప్రభుత్వం వివిధ సంక్షేమ పథకాల కోసమని రూ.వేల కోట్లు ఖర్చు చేస్తోంది. లబ్ధిదారుల ఖాతాల్లో నిధులు జమ చేస్తోంది. ఉద్యోగుల విషయానికి వచ్చేసరికి నిర్లక్ష్యం చూపడం భావ్యం కాదు. నిధుల కొరత పేరుతో ఉద్యోగుల జీతాలను ప్రతి నెలా ఆలస్యం చేయడం ఏమిటీ? ఇచ్చిన హామీల్లో వేటినీ అమలు చేయలేదు. ఇప్పుడు జీతాల కోసం ఎదురుచూడాల్సిన పరిస్థితికి తీసుకొచ్చారు. ఉద్యోగుల బాధలను, పరిస్థితులను అర్థం చేసుకుని, సకాలంలో జీతాలు జమ చేయాలి.
– జీవీఎల్ కిశోర్, జిల్లా అధ్యక్షుడు, ఏపీఎన్‌జీవో సంఘం, పార్వతీపురం మన్యం


