వాటర్‌షెడ్‌ మహోత్సవ్‌– 2025పై సోషల్‌మీడియా పోటీలు | - | Sakshi
Sakshi News home page

వాటర్‌షెడ్‌ మహోత్సవ్‌– 2025పై సోషల్‌మీడియా పోటీలు

Dec 11 2025 9:27 AM | Updated on Dec 11 2025 9:27 AM

వాటర్

వాటర్‌షెడ్‌ మహోత్సవ్‌– 2025పై సోషల్‌మీడియా పోటీలు

వాటర్‌షెడ్‌ మహోత్సవ్‌– 2025పై సోషల్‌మీడియా పోటీలు నారాయణగూడ గ్రామస్తులకు పొజిషన్‌ సర్టిఫికెట్లు ట్రాక్టర్‌పై నుంచి జారిపడిన వ్యక్తి మృతి

పార్వతీపురం: భారత గ్రామీణాభివృద్ధి మంత్రి త్వశాఖకు చెందిన భూసంసాదన విభాగం ఆధ్వర్యంలో వాటర్‌షెడ్‌ మహోత్సవ్‌– 2025పై సోషల్‌ మీడియాలో పోటీలు నిర్వహించనున్న ట్లు కలెక్టర్‌ డా.ఎన్‌.ప్రభాకరరెడ్డి బుధవారం ఒక ప్రకటనలో తెలిపారు. వాటర్‌ షెడ్‌ అభివృద్ధి పనులు, నీటి సంరక్షణ నిర్మాణాలు, ఆగ్రోఫారెస్ట్రీ/హార్టికల్చర్‌ కార్యకలాపాలపై రీల్స్‌ (30నుంచి 60 సెకెన్లు నిడివి) సోషల్‌ మీడియాలో పోస్ట్‌ చేసేవారు ఎవరైనా ఇందులో పాల్గొనవచ్చునన్నారు. వాటర్‌షెడ్‌ మహోత్సవ్‌ ఆంధ్ర, ఇండియా హ్యష్‌ట్యాగ్‌ ఉపయోగించి తమ పోస్టులను డిసెంబర్‌ 31వ తేదీలోగా పంపించాలని స్పష్టం చేశారు. అలాగే వాటి లింక్‌లనుకూడా వెబ్‌సైట్‌లో రిజిస్టర్‌ చేయాలన్నారు. ఉత్తమ రీల్‌కు రూ.50వేల చొప్పున ఐదు అవా ర్డులు, ఉత్తమ ఫొటోకు రూ.1,000 చొప్పున 100 అవార్డులు ఇవ్వనున్నామన్నారు. రీల్స్‌ పంపేవారి నుంచి ఆర్గానిక్‌ రీచ్‌, ప్రామాణిక కంటెంట్‌ మాత్రమే పరిగణనలోకి తీసుకుంటా మన్నారు. ప్రభుత్వ ఉద్యోగులకు ఈ పోటీల్లో పొల్గొనేందుకు అర్హత లేదని పేర్కొన్నారు.

సీతంపేట: వారం రోజుల్లో సబ్‌డివిజనల్‌ కమిటీ సమావేశం, జిల్లా కమిటీ ఆమోదం అయిన వెంటనే నారాయణ గూడ గిరిజనులకు ల్యాండ్‌ పొజిషన్‌ షర్టిఫికెట్లు అందజేస్తామని పాలకొండ సబ్‌కలెక్టర్‌, ఐటీడీఏ ఇన్‌చార్జి పీఓ పవార్‌ స్వప్నిల్‌ జగన్నాథ్‌ శుక్రవారం ఒక ప్రకటనలో తెలిపారు. ఈ నెల 8న ‘ఇళ్లు పీకి పందిరి’ శీర్షికన ‘సాక్షి’లో ప్రచురితమైన కథనానికి అధికారులు స్పందించారు. నారాయణగూడలో 13 మంది గిరిజనులకు ఇళ్ల స్థలాలు పీఎంజన్‌మన్‌ స్కీమ్‌లో మంజూరయ్యాయని, ఇల్లు నిర్మించుకోవడానికి ఎల్‌పీసీ అవసరం ఉందన్నారు. లబ్ధిదారులు ఇళ్లు నిర్మించుకోవడానికి పొజిషన్‌ షర్టిఫికెట్లు కావా లని దరఖాస్తుచేసుకున్నవెంటనే క్షేత్రస్థాయిలో సర్వేయర్‌ను పంపించి పరిశీలించామన్నారు. మ్యాపింగ్‌ చేసి పాలకొండ సబ్‌కలెక్టర్‌ కార్యాలయానికి పంపించారన్నారు. దీనిపై త్వరలోనే తగు చర్యలు తీసుకుంటామని స్పష్టంచేశారు.

సాలూరు: ఇటుకల లోడుతో వెళ్తున్న ట్రాక్టర్‌ ఇంజిన్‌ పై నుంచి పడిన వ్యక్తి మృతిచెందాడు. పోలీసులు, స్థానికులు తెలిపిన వివరాల ప్రకారం.. గజపతినగరం నుంచి అనంతగిరి మండలం రొంపల్లి పంచాయతీ కోటపర్తివలసకు బుధవారం ట్రాక్టర్‌పై ఇటుకల లోడును తరలిస్తున్నారు. మెంటాడ మండలం గుర్ల గ్రామం వద్దకు వచ్చేసరికి అనంతగిరి మండలం రొంపల్లి పంచాయతీ మూలవలస గ్రామానికి చెంది కోటపర్తి గణేష్‌ అలియాస్‌ పండు (18) ట్రాక్టర్‌ డ్రైవర్‌ పక్కన కూర్చొని ప్రమాదవశాత్తు జారిపడి ట్రాక్టర్‌ కిందపడిపోయాడు. ఆయన పైనుంచి ట్రాక్టర్‌ టైరు వెళ్లిపోవడంతో తల నుజ్జయ్యింది. ఆండ్ర ఎస్‌ఐ కె. సీతారాం కేసు నమోదుచేసి మృతదేహాన్ని పోస్టుమార్టం కోసం గజపతినగరం ఏరియా ఆస్పత్రికి తరలించారు.

మానవ హక్కులపై అవగాహన

విజయనగరం అర్బన్‌: మానవ హక్కులపై ప్రతి ఒక్కరికి అవగాహన అవసరమని సీనియర్‌ సివిల్‌ జడ్జి డాక్టర్‌ ఎ.కృష్ణప్రసాద్‌ అన్నారు. జాతీయ న్యాయసేవాధికార సంస్థ రాష్ట్ర విభాగం ఆదేశాల మేరకు ప్రపంచ మానవ హక్కుల దినోత్సవం సందర్భంగా జిల్లా న్యాయ సేవాధికార ఆధ్వర్యంలో బుధవారం అవగాహన సదస్సులు, ర్యాలీలు నిర్వహించారు. మహారాజా అటానమస్‌ కళాశాలలో ప్రిన్సిపాల్‌ ప్రొఫెసర్‌ ఎం.సాంబశివరావు అధ్యక్షతన జరిగి న కార్యక్రమంలో ఆయన మాట్లాడుతూ హక్కు ల కోసం ప్రశ్నించడం నేర్చుకోవాలని, ప్రశ్నిస్తేనే సమాధానం దొరుకుతుందని పిలుపునిచ్చారు. కళాశాలలో నిర్వహించిన వ్యాసరచన, వక్తృత్వ పోటీల్లో విజేతలు రాకేష్‌, సంధ్యకు బహుమతు లు ప్రదానం చేశారు. కార్యక్రమంలో వన్‌ టౌన్‌ ఎస్‌ఐ ప్రసన్నకుమార్‌, అడ్వకేట్‌ కరుణాకర్‌, జిల్లా ఎన్‌ఎస్‌ఎస్‌ నోడల్‌ అధికారి జి.చంద్రశేఖ ర్‌, ఎన్‌ఎస్‌ఎస్‌ ప్రొగ్రాం అధికారులు సీహెచ్‌ చిన్నమనాయుడు, పీఎన్‌బీ శర్మ, ఎన్‌.వై.విష్టు, తదితరులు పాల్గొన్నారు.

వాటర్‌షెడ్‌ మహోత్సవ్‌– 2025పై సోషల్‌మీడియా పోటీలు1
1/1

వాటర్‌షెడ్‌ మహోత్సవ్‌– 2025పై సోషల్‌మీడియా పోటీలు

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement