ప్రకృతి సేద్యంతో నిత్య ఆదాయం
పార్వతీపురం రూరల్: పుడమి తల్లి పులకించేలా.. రైతు ఇల్లు సిరులతో తులతూగేలా ప్రకృతి సేద్యం సాగాలని కలెక్టర్ డాక్టర్ ఎన్.ప్రభాకర రెడ్డి ఆకాంక్షించారు. బందలప్పి గ్రామంలో రైతు కె.మురళి ప్రకృతి వ్యవసాయ క్షేత్రాన్ని ఆయన బుధవారం సందర్శించారు. రసాయనాల ఘాటులేని, ఆరోగ్యానికి మేలు చేసే ప్రకృతి వ్యవసాయ విధానం అందరికీ ఆదర్శమన్నారు.
కేవలం 0.20 ఎకరా ల్లో ఏటీఎం నమూనాలో దొండ, చిక్కుడు, మిరప, ఆకుకూరలను సాగుచేస్తూ ఏడాదికి రూ.80,000 వరకు నికర ఆదాయం ఆర్జించడం అభినందనీయమన్నారు. కార్యక్రమంలో వ్యవసాయ, ఉద్యాన శాఖ అధికారులు పాల్గొన్నారు.


