లోక్‌ అదాలత్‌లో కేసులు పరిష్కారం కావాలి | - | Sakshi
Sakshi News home page

లోక్‌ అదాలత్‌లో కేసులు పరిష్కారం కావాలి

Dec 11 2025 9:27 AM | Updated on Dec 11 2025 9:27 AM

లోక్‌

లోక్‌ అదాలత్‌లో కేసులు పరిష్కారం కావాలి

సిబ్బందికి ఎస్పీ దామోదర్‌ ఆదేశాలు

విజయనగరం క్రైమ్‌: లోక్‌ అదాలత్‌లో కేసులు పరిష్కారమయ్యే విధంగా చర్యలు చేపట్టాలని ఎస్పీ దామోదర్‌ అన్నారు. ఈ నెల 13న జాతీయ లోక్‌ అదాలత్‌లో ఎక్కువ కేసులు పరిష్కారమయ్యే విధంగా సంబంధిత పోలీసు అధికారులు, సిబ్బంది అన్ని ముందస్తు చర్యలు చేపట్టాలని ఎస్పీ ఎ.ఆర్‌.దామోదర్‌ సిబ్బందిని బుధవారం ఆదేశించారు. పోలీస్‌స్టేషన్‌ పరిధిలో నమోదైన కేసుల్లో ఇరు వర్గాలు రాజీ అయ్యేందుకు అవకాశం ఉన్న కుటుంబ వివాదాలు, ఆస్తి తగాదాలు, చిన్న క్రిమినల్‌ కేసులు, ట్రాఫిక్‌ కేసులు, ఎకై ్సజ్‌, రోడ్డు ప్రమాద కేసులు, పెండింగ్‌ ఈ చలాన్లు, ఇతర కాంపౌండ్‌ కేసులను ముందుగా గుర్తించాలని సూచించారు. ఆయా కేసుల్లో ఇరు వర్గాలతో సంప్రదించి, సమావేశాలు నిర్వహించి, వారు రాజీ అయ్యే విధంగా మానవతా దృక్పధంతో వ్యవహరించాలని స్పష్టం చేశారు.

ముత్తూట్‌ ఫిన్‌ కార్ప్‌లో

బంగారం మాయం

విజయనగరం క్రైమ్‌: విజయనగరంలోని ముత్తూట్‌ ఫిన్‌కార్ప్‌లో బంగారం మాయమైందని ముత్తూట్‌ ఫైనాన్స్‌ లో కాదని విజయనగరం వన్‌ టౌన్‌ పోలీసులు బుధవారం తెలిపారు. ఈ ఈ మేరకు ముత్తూట్‌ ఫైనాన్స్‌ నుంచి బంగారం మాయం అంటూ బుధవారం వార్త ప్రచురితమైన విషయంవిదితమే. ముత్తూట్‌ ఫిన్‌కార్ఫ్‌ లో బంగారం మాయమైంటూ తమకు సమాచారం రావడంతో దర్యాప్తు చేస్తున్నామని వన్‌ టౌన్‌ ఏఎస్‌ఐ జగన్మోహన్‌ రావు తెలిపారు. అసలు ముత్తూట్‌ ఇద్దరు అన్నదమ్ముల పేరుతో ఉందని విజయనగరంలో ఈ ఫిన్‌కార్ప్‌ ఒక్కటే ఉందని ఏఎస్సై తెలిపారు. ముత్తూట్‌ పైనాన్స్‌లో గోల్డ్‌ గల్లంతు కాని, మాయం కానీ జరగలేదని పోలీసులు స్పష్టం చేశారు.

కానిస్టేబుల్స్‌ అభ్యర్థులు 15న హాజరు కావాలి

విజయనగరం క్రైమ్‌: కానిస్టేబుల్స్‌గా ఎంపికై న జిల్లా అభ్యర్థులు ఈ నెల 15వ తేదీన డీపీఓ వద్ద ఉదయం 5గంటలకు హాజరుకావాలని ఎస్పీ ఎ.ఆర్‌.దామోదర్‌ బుధవారం కోరారు. జిల్లాలో కానిస్టేబుల్స్‌గా ఎంపికై న స్థానిక పురుష, మహిళా అభ్యర్థులు వారితో పాటు మరో ఇద్దరు (తల్లిదండ్రులు లేక దగ్గర బంధువులు) మొత్తం ముగ్గురు హాజరుకావాలన్నారు. పురుష అభ్యర్ధులు నీట్‌ షేవింగ్‌, కటింగ్‌లో రావాలన్నారు. ఇక్కడి నుంచి వారిని సురక్షితంగా విజయవాడ తీసుకువెళ్తామన్నారు. ఈ నెల 16న మంగళగిరి బెటాలియన్‌ లోని పరేడ్‌ మైదానంలో కానిస్టేబుల్‌ అభ్యర్థులతో ముఖాముఖి నిర్వహించి వారికి దిశానిర్దేశం చేస్తారన్నారు. అనంతరం అక్కడే అభ్యర్థులకు ఉద్యోగ నియామక పత్రాలు అందజేయనున్నట్లు తెలిపారు. తదుపరి అభ్యర్థులను మళ్లీ విజయనగరం తీసుకురానున్నట్లు ఎస్పీ తెలిపారు. అభ్యర్థులు తిరిగి వారి సొంత ఊళ్లకు వెళ్లి, ఈ నెల 22 నుంచి శిక్షణ ప్రారంభం కానుందని, కావున వారికి కేటాయించిన పీటీసీ, డీటీసీలలో అభ్యర్ధులు ఈ నెల 21న రిపోర్ట్‌ చేయాల్సి ఉంటుందన్నారు.

1400 లీటర్ల పులిసిన బెల్లం ఊటలు ధ్వంసం

సీతంపేట: మండలంలోని కర్రగూడ సమీపంలోని పరిసరాల్లో సారా బట్టీలపై బుధవారం చేసిన దాడుల సందర్భంగా 1400 లీటర్ల పులిసిన బెల్లం ఊటలు ధ్వంసం చేసినట్లు ఎస్సై వై.అమ్మన్నరావు తెలిపారు. మొత్తం 14 డ్రమ్ములు స్వాధీనం చేసుకుని నిర్వాహకులపై కేసు నమోదు చేశామన్నారు.

గొర్రె పందాల రాయుళ్ల అరెస్ట్‌

జియ్యమ్మవలస: మండలంలోని చినమేరంగి పోలీస్‌ స్టేషన్‌ పరిధిలో సింగనాపురం గ్రామం ఊరు శివారులో గొర్రె పందాలు ఆడిస్తుండగా మెరుపుదాడి రెండు గొర్రెపోతులు, ఐదుగురు నిందితులను పట్టుకుని రూ.1025 స్వాధీనం చేసుకున్నామని ఎస్టీఎఫ్‌ పోలీసులు తెలిపారు. పట్టుకున్న నిందితులపై చినమేరంగి పోలీస్‌ స్టేషన్‌లో కేసు నమోదు చేసినట్లు చెప్పారు.

లోక్‌ అదాలత్‌లో కేసులు పరిష్కారం కావాలి1
1/1

లోక్‌ అదాలత్‌లో కేసులు పరిష్కారం కావాలి

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement