బస్సు, ద్విచక్రవాహనం ఢీ● ముగ్గురికి గాయాలు
మక్కువ/సాలూరు రూరల్: మక్కువ మండలంలోని ఎస్.పెద్దవలస గ్రామం సమీపంలో బుధవారం ఆర్టీసీబస్సు, ద్విచక్రవాహనం ఢీకొన్న ఘటనలో ముగ్గురు వ్యక్తులకు గాయాలయ్యాయి. ఈ ఘటన వివరాలిలా ఉన్నాయి. సాలురు మండలం మావుడి గ్రామానికి చెందిన చోడిపల్లి సాయి 9నెలల గర్భవతి. ఆమె చోడిపల్లి గణేష్, చోడిపల్లి పరుసుతో కలిసి, మామిడిపల్లి పీహెచ్‌సీకి సీఎన్‌సీ పరీక్షలు నిమిత్తం వచ్చి, వైద్యపరీక్షలు జరిపించుకుంది. ఆస్పత్రినుంచి, గ్రామానికి ద్విచక్రవాహనంపై ముగ్గురూ వెళ్తుండగా, మక్కువ మండలం ఎస్.పెద్దవలస గ్రామం సమీపంలో చెరువు వద్ద, ఆర్టీసీ బస్సు ఢీకొనడంతో ముగ్గురూ గాయాలపాలయ్యారు. వెంటనే స్థానికులు 108కు సమాచారం అందించారు. 108 సిబ్బంది సంఘటన స్థలానికి చేరుకుని గాయాలపాలైన వారిని సాలూరు ఆస్పత్రికి తరలించారు. అక్కడినుంచి మెరుగైన చికిత్సకోసం విజయనగరం తరలించారు.
రోడ్డు ప్రమాదంలోవ్యక్తికి తీవ్రగాయాలు
గంట్యాడ: మండలంలోని రావివలస గ్రామానికి ఆర్.అదినారాయణ రోడ్డు ప్రమాదంలో తీవ్రంగా గాయపడ్డాడు. ఎలక్ట్రికల్ హెల్పర్‌గా పనిచేస్తున్న ఆదినారాయణ బుధవారం రాత్రి 7 గంటల సమయంలో తామరాపల్లి నుంచి గంట్యాడకు పల్సర్ బైక్‌పై వస్తుండగా గింజేరు జంక్షన్ సమీపంలో శ్రీను అనే వ్యక్తి భార్యతో కలిసి రోడ్డుపై మేకలు తోలుకుని వెళ్తుండగా బైక్‌తో ఆదినారాయణ మేకలను ఢీకొట్టాడు. దీంతో రెండు మేకలు అక్కడికక్కడే మృతి చెందాయి. మేకలను ఢీకొట్టి కింద పడిపోయిన ఆదినారాయణ తలకు తీవ్ర గాయాలు కావడంతో స్థానికులు హైవే అంబులెన్సులో విజయనగరంలోని ప్రైవేట్ ఆస్పత్రికి తరలించారు.


