అటవీహక్కుల చట్టంపై అవగాహన కలిగించాలి
● జాయింట్ కలెక్టర్, ఐటీడీఏ పీఓ
సి.యశ్వంత్‌కుమార్ రెడ్డి
పార్వతీపురం: ఎన్‌జీఓలు అటవీహక్కుల చట్టాలపై గిరిజనులకు అవగాహన కల్పిస్తే చాలా సమస్యలు పరిష్కరమవుతాయని జాయింట్ కలెక్టర్, ఐటీడీఏ పీఓ సి.యశ్వంత్‌కుమార్ రెడ్డి అన్నారు. ఈ మేరకు బుధవారం ఆయన గిరిమిత్ర సమావేశమందిరంలో అటవీ హక్కుల యాజమాన్య పద్దతుల గురించి అజీమ్ ప్రేమ్ జీ ఫౌండేషన్ ఆధ్వర్యంలో ఎన్‌జీఓ ప్రతినిధులతో నిర్వహించిన సమావేశంలో పాల్గొన్నారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ అటవీహక్కుల చట్టం దాని అమలు, అమలులో నెలకొన్న సమస్యల పరిష్కారం దిశగా ఏం చేయాలనే అంశంపై సమావేశంలో చర్చించనున్నామన్నారు. అటవీహక్కుల చట్టాలపై గిరిజనులకు పూర్తిస్థాయిలో అవగాహన గిఉండాలన్నారు. సమస్యలు, క్లెయిమ్‌లకు సంబంధించి పూర్తి ఆధారాలను సమర్పిస్తే పరిష్కరిస్తామని చెప్పారు. కార్యక్రమంలో ఎఫ్‌ఆర్‌ఏ రాష్ట్ర కో ఆర్డినేటర్ బి. ఆదినారాయణరావు, ఏపీఓ పి.మురళీధర్, పార్వతీపురం, సీతంపేట, విజయనగరం ప్రాంతాలకు చెందిన ఆర్‌ఓఎఫ్‌ఆర్ జిల్లా కోఆర్డినేటర్లు పొల్గొన్నారు.


