పిల్లల్ని యంత్రాలుగా మార్చొద్దు
పదో తరగతి విద్యార్థులపై ‘వంద రోజుల ప్రణాళిక’ పేరిట తీవ్ర ఒత్తిడి పెంచడం తగదు . శని, ఆదివారాల్లో తరగతుల నిర్ణయంపై తీవ్ర అసహనం వ్యక్తం చేస్తున్నాం.ఇప్పటికే సిలబస్ పూర్తయినందున వారికి కావాల్సింది విశ్రాంతి, స్వయం పఠనమే. అలాగే మరోవైపు సెలవుల్లో పనిచేయిస్తూనే.. ఉపాధ్యాయులకు ‘సీసీఎల్’ మంజూరులో కఠిన నిబంధనలు, మెలికలు పెట్టడం అన్యాయం. బోధనేతర పనుల భారం తగ్గించి, సీసీఎల్‌పై విధించిన అసంబద్ధ నిబంధనలను వెంటనే వెనక్కి తీసుకోవాలి. – ఏపీటీఎఫ్ జిల్లా ప్రధాన కార్యదర్శి,
ఉపాధ్యాయుడు ఎన్.బాలకృష్ణ


