చికిత్స పొందుతూ ఉపాధి ఫీల్డ్‌ అసిస్టెంట్‌ మృతి | - | Sakshi
Sakshi News home page

చికిత్స పొందుతూ ఉపాధి ఫీల్డ్‌ అసిస్టెంట్‌ మృతి

Dec 10 2025 7:56 AM | Updated on Dec 10 2025 7:56 AM

చికిత

చికిత్స పొందుతూ ఉపాధి ఫీల్డ్‌ అసిస్టెంట్‌ మృతి

కురుపాం: కురుపాం–గొరడ ప్రధాన రహదారిలో బుడ్డెమ్మ ఖర్జ సమీపంలో రెండు ద్విచక్రవాహనాలు ఎదురెదురుగా ఆదివారం సాయంత్రం ఢీ కొన్న ఘటనలో కిచ్చాడ పంచాయతీ ఉపాధి హామీ ఫీల్డ్‌ అసిస్టెంట్‌ గోళ్ల గౌరీశంకర్‌ కు తీవ్ర గాయాలైన సంఘటన విదితమే. ఈ మేరకు సంఘటన స్థలం నుంచి కురుపాం సామాజిక ఆరోగ్య కేంద్రానికి 108 వాహనంలో తరలించగా వైద్యులు ప్రాథమిక వైద్యం అందించిన తరువాత మెరుగైన వైద్య సేవల కోసం పార్వతీపురం ఏరియా ఆస్పత్రికి, అక్కడి నుంచి విజయనగరం ఆస్పత్రికి తరలించగా చికిత్స పొందుతూ మంగళవారం మృతి చెందినట్లు గ్రామస్తులు తెలిపారు. మృతుడు గౌరీశంకర్‌కు భార్య, ఇద్దరు పిల్లలు ఉన్నారు.

ఎలక్ట్రానిక్స్‌ షాపులో అగ్నిప్రమాదం

రాజాం సిటీ: మున్సిపాల్టీ పరిధి డోలపేట గ్రామంలోని ఎలక్ట్రానిక్స్‌ దుకాణంలో మంగళవారం అగ్నిప్రమాదం సంభవించింది. షాపులోనుంచి ఒక్కసారిగా మంటలు రావడంతో షాపు యజమానితోపాటు స్థానికులు ఆందోళనకు గురయ్యారు. వెంటనే ఫైర్‌స్టేషన్‌కు సమాచారం అందించడంతో ఎస్సై పి.అశోక్‌ సిబ్బందితో సంఘటనా స్థలానికి చేరుకుని మంటలు అదుపు చేశారు. ఈ ఘటనలో ఎలక్ట్రానిక్‌ పరికరాలతోపాటు ఏసీ, ఫ్రిడ్జ్‌, రిమ్మల్స్‌ స్పేర్‌పార్ట్స్‌ కాలిపోగా సుమారు రూ.2లక్షలు ఆస్తినష్టం సంభవించిందని ఫైర్‌ ఎస్సై తెలిపారు.

800 లీటర్ల బెల్లం ఊట ధ్వంసం

కురుపాం: ఎకై ్సజ్‌ దాడుల్లో 800 లీటర్ల బెల్లం ఊట ధ్వంసం చేసినట్లు కురుపాం ఎకై ్సజ్‌ సర్కిల్‌ ఇన్‌స్పెక్టర్‌ పి.శ్రీనివాసరావు తెలిపారు. ఈ మేరకు మంగళవారం ఆయన మాట్లాడుతూ ముందస్తు సమాచారం మేరకు సర్కిల్‌ పరిధిలో కొమరాడ మండలంలోని రెబ్బ గ్రామంలో సారా తయారీ కేంద్రాలపై సంయుక్తంగా దాడులు నిర్వహించగా సారా తయారీ కోసం 800 లీటర్ల బెల్లం ఊట నిల్వ ఉంచినట్లు గుర్తించి ధ్వంసం చేసినట్లు తెలిపారు. సారా బట్టీ నిర్వాహకుడిగా తాడంగి గోపాల్‌ను ఈ దాడుల్లో గుర్తించి కేసు నమోదు చేసినట్లు తెలిపారు. దాడుల్లో టాస్క్‌ ఫోర్స్‌ ఇన్‌స్పెక్టర్‌ వి.వి.వి.ఎస్‌. శేఖర్‌బాబు, ఎస్సైలు రాజశేఖర్‌, చంద్రకాంత్‌, కురుపాం ఎకై ్సజ్‌ సిబ్బంది పాల్గొన్నారన్నారు.

63 మద్యం బాటిల్స్‌ ధ్వంసం

రాజాం సిటీ: స్థానిక టౌన్‌ సర్కిల్‌ కార్యాలయం ఆవరణలో పలు కేసుల్లో పట్టుబడిన 63 మద్యం బాటిల్స్‌ను అసిస్టెంట్‌ ఎకై ్సజ్‌ సూపరింటెండెంట్‌ శ్రీరంగందొర మంగళవారం ధ్వంసం చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ గ్రామాల్లో బెల్టుషాపులు నిర్వహిస్తే చర్యలు తీసుకుంటున్నామ న్నారు. ఇప్పటికే ఎకై ్సజ్‌ సిబ్బందికి బెల్టు నిర్వహణపై దాడులు నిర్వహించేలా ఆదేశాలు జారీచేశామని తెలిపారు. అనంతరం పలు కేసుల్లో పట్టుబడిన వాహనాలకు వేలం నిర్వహించారు. కార్యక్రమంలో టౌన్‌ సీఐ కె.అశోక్‌కుమార్‌, సిబ్బంది పాల్గొన్నారు.

ముత్తూట్‌ ఫైనాన్స్‌లో అరకిలో బంగారం మాయం

విజయనగరం క్రైమ్‌: విజయనగరం ముత్తూట్‌ ఫైనాన్స్‌ కంపెనీలో నుంచి అరకేజీ బంగారం మాయమైంది. ఆడిట్‌ తనిఖీకి వచ్చిన ఉద్యోగే ఏడు ప్యాకెట్లలో ఉన్న బంగారాన్ని సైడ్‌ చేశాడు. ఇందుకు సంబంధించి వన్‌టౌన్‌ పోలీస్‌ స్టేషన్‌ ఎస్సై రవి కేసు నమోదు చేశారు. ఆడిట్‌ తనిఖీల్లో భాగంగా ముత్తూట్‌ ఫైనాన్స్‌ కంపెనీలో ఆడిట్‌ ఇన్‌స్పెక్టర్‌ మనోజ్‌ తనిఖీలు చేసే క్రమంలో మేనేజర్‌తో మాట్లాడుతుండగానే దాదాపు రూ.48 లక్షలు విలువ చేసే అరకేజీ బంగారాన్ని స్వాహా చేశాడు. తనిఖీ అనంతరం సీసీ ఫుటేజీని పరిశీలించిన బ్రాంచ్‌ మేనేజర్‌ కంగుతిని పోలీసులకు ఫిర్యాదు చేశాడు. తానే ఆ బంగారాన్ని పట్టుకెళ్లానని తిరిగి ఇమ్మని అడిగినా, పోలీసులకు ఫిర్యాదు చేసినా ఆత్మహత్య చేసుకుంటానని ముత్తూట్‌ ఫైనాన్స్‌ మేనేజర్‌కు మెసేజ్‌ చేశాడు. దీనిపై వన్‌టౌన్‌ ఎస్సై రవి ఫండ్స్‌ మిస్‌ అప్రోప్రియేషన్‌ కింద కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు.

చికిత్స పొందుతూ ఉపాధి  ఫీల్డ్‌ అసిస్టెంట్‌ మృతి1
1/2

చికిత్స పొందుతూ ఉపాధి ఫీల్డ్‌ అసిస్టెంట్‌ మృతి

చికిత్స పొందుతూ ఉపాధి  ఫీల్డ్‌ అసిస్టెంట్‌ మృతి2
2/2

చికిత్స పొందుతూ ఉపాధి ఫీల్డ్‌ అసిస్టెంట్‌ మృతి

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement