సాఫ్ట్‌బాల్ పోటీల్లో సత్తాచాటిన జిల్లా జట్లు
తెర్లాం: రాష్ట్రస్థాయి స్కూల్ గేమ్స్ ఫెడరేషన్ అండర్–19 సాఫ్ట్‌బాల్ పోటీల్లో జిల్లా బాలురు, బాలికల జట్లు సత్తా చాటాయి. ఈనెల 6 నుంచి 8వరకు గుంటూరు జిల్లా మోదుకూరులో జరిగిన రాష్ట్రస్థాయి ఎస్‌జీఎఫ్ అండర్–19 సాఫ్ట్‌బాల్ పోటీల్లో జిల్లాకు చెందిన బాలుర జట్టు ప్రథమ స్థానం సాధించగా, బాలికల జట్టు తృతీయ స్థానాన్ని కై వసం చేసుకుంది. రాష్ట్రస్థాయి స్కూల్ గేమ్స్ ఫెడరేషన్ పోటీల్లో రాష్ట్రంలోని 13 జిల్లాల నుంచి బాలురు, బాలికల జట్లు పాల్గొన్నాయని, ఈ పోటీల్లో విజయనగరం జిల్లా జట్లు అత్యుత్తమ ప్రతిభను కనబరిచినట్లు జిల్లా జట్ల మేనేజర్ చొక్కాపు సత్యనారాయణ మంగళవారం తెలియజేశారు. రాష్ట్రస్థాయి సాఫ్ట్‌బాల్ ఫైనల్ పోటీల్లో జిల్లా బాలుర జట్టు కడప జట్టుతో తలపడి ప్రథమ స్థానం సాధించింది. అలాగే బాలికల జట్టు కడప బాలికల జట్టుతో పోటీపడి తృతీయ స్థానాన్ని కై వసం చేసుకుంది. రాష్ట్రస్థాయి స్కూల్ గేమ్స్ పోటీల్లో పాల్గొన్న జిల్లా బాలురు, బాలికల జట్లకు కోచ్‌లుగా శివ, మహేష్, మేనేజర్‌గా పీడీ సత్యనారాయణ వ్యవహరించారు. జిల్లాకు చెందిన బాలురు, బాలికల జట్లు రాష్ట్రస్థాయి సాఫ్ట్‌బాల్ పోటీల్లో రాణించడంతో క్రీడాకారులను స్కూల్ గేమ్స్ ఫెడరేషన్ జిల్లా అధ్యక్ష, కార్యదర్శులు, పలువురు పీడీలు, పీఈటీలు అభినందించారు. మరిన్ని పోటీల్లో జిల్లా బాలికల, బాలుర జట్లు మరింత బాగా రాణించి జిల్లాకు మంచిపేరు తీసుకురావాలని వారంతా ఆకాంక్షించారు.
ఈనెల 6 నుంచి 8 వరకు
గుంటూరు జిల్లాలో జరిగిన పోటీలు
రాష్ట్రస్థాయిలో ప్రఽథమ స్థానం
సాధించిన బాలుర జట్టు
తృతీయ స్థానాన్ని కై వసం చేసుకున్న బాలికల జట్టు
సాఫ్ట్‌బాల్ పోటీల్లో సత్తాచాటిన జిల్లా జట్లు


