గోపీనాథ ఆలయంలో చోరీ
● రాధాకృష్ణుల విగ్రహాలపై ఉన్న
వెండి, బంగారు నగలు మాయం
భామిని: వంశధార నదీ తీరంలో ప్రముఖ వైష్ణవాలయంగా వెలుగొందుతున్న లివిరి గోపీనాథ రాధాకృష్ణ ఆలయంలో చోరీ జరిగింది. మంగళవారం వేకువ జామున దేవాలయంలో దొంగలు పడ్డారనే వార్త గుప్పుమంది. దీంతో చుట్టుపక్కల గ్రామాల ప్రజలు ఆలయాన్ని చుట్టుముట్టి జరిగిన చోరీపై చర్చించారు. ఈ సమాచారం అందుకున్న పాలకొండ డీఎస్పీ రాంబాబు, బత్తిలి ఎస్సై జి.అప్పారావులు సంఘటన స్థలాన్ని పరిశీలించారు. వెనువెంటనే క్లూస్ టీమ్‌ను రప్పించి ఆధారాలు సేకరించారు. చోరులు ఆలయం తలుపులకు ఉన్న నాలుగు తాళాలు దుండగులు విరగొట్టారు. రాధాకృష్ణుల మూర్తులపై ఉన్న ఆభరణాలను సీసీ కెమెరా వైర్లు కట్ చేసిన వీడియోలు నిలువ చేసే డీబీఎంను కూడా చోరీ చేసినట్లు పోలీసులు గుర్తించారు. ఈ చోరీలో సుమారు 56 తులాల వెండి వస్తువులు, అరతులం బంగారు ముక్కెరలు పోయినట్లు ఆలయ ఆర్చకుడు గోపీనాథ చౌదరి ఇచ్చిన ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు బత్తిలి ఎస్సై జి.అప్పారావు తెలిపారు. ఆలయ ప్రాంగణంలో సర్పంచ్ బౌరి సౌదామిని, మాజీ ఏఎంసీ చైర్మన్ సోమరాజు గోపాలరావు, మాజీ సర్పంచ్ ఎస్.రమణారావు, మిల్లరు కై లాస్ గౌడో, మండల నాయకులు తరలివచ్చి పోలీసులకు సహకరించారు.
గోపీనాథ ఆలయంలో చోరీ


