163 సెల్‌ఫోన్స్ రికవరీ
● బాధితులకు అప్పగించిన ఎస్పీ
దామోదర్
విజయనగరం క్రైమ్: ఏ మొబైల్ ఫోన్ పోయినా ఇక నుంచి సైబల్ సెల్ స్టేషన్‌కు వెళ్లవనసరం లేదని ఎస్పీ దామోదర్ అన్నారు. ఈ మేరకు మంగళవారం ఆయన మాట్లాడుతూ దగ్గరలోని పోలీస్ స్టేషన్ లో మొబైల్ పోయినట్లు లేదా మిస్ అయినట్లు ఫిర్యాదు చేయవచ్చన్నారు. జిల్లా వ్యాప్తంగా పోయిన 163 సెల్ ఫోన్స్ రికవరీ చేసి వాటిని పొగొట్టుకున్న వారికి జిల్లా పోలీస్ కార్యాలయంలో ఎస్పీ అందజేశారు. జిల్లాలో పోగొట్టుకున్న మొబైల్ ఫోన్లను ట్రాక్ చేసేందుకు ప్రత్యేకంగా ’మిస్సింగ్ మొబైల్ ట్రాకింగ్ సిస్టం’ ఏర్పాటు చేశామన్నారు. ఈ విధానంతో విజయనగరంలో సైబర్ సెల్ స్టేషన్ కు రావాల్సిన అవసరం లేదన్నారు. మొబైల్ పోగొ ట్టుకున్న వ్యక్తులు తమకు దగ్గరలోని పోలీస్ స్టేషన్ ను సంప్రదించి, పోగొట్టుకున్న మొబైల్స్ వివరాల ను అందించినట్లయితే, ’మిస్సింగ్ మొబైల్ ట్రాకింగ్ సిస్టం’ ద్వారా పోయిన మొబైల్‌ను ట్రాక్ చేసేందుకు చర్యలు చేపడతామని ఎస్పీ ఏఆర్.దామోదర్ అన్నారు. ఇప్పటి వరకు జిల్లాలో సుమారు రూ.6.23కోట్ల విలువైన 3,463 మొబైల్ ఫోన్లు ట్రాక్ చేసి, బాధితులకు అందజేశామన్నారు. అదే విధంగా ప్రస్తుతం మరో 163 మొబైల్ ఫోన్‌లు సైబర్ సెల్ పోలీసులు, సిబ్బంది నిరంతరం శ్రమించి, ట్రాక్ చేశారని తెలిపారు. కార్యక్రమంలో సైబర్ సెల్ సీఐ శోభన్ బాబు, ఎస్బీ సీఐలు ఏవీ లీలారా వు, అంబేడ్కర్, డీసీఆర్బీ సీఐ కె.కుమార స్వామి, ఎస్సై రాజేష్, సైబర్ సెల్ సిబ్బంది శ్రీనివాసరావు, వాసుదేవ్, తిరుపతి నాయుడు, రాజేష్, నాగమణి, శిరీష పాల్గొన్నారు.


