నిబంధనలు పాటించకపోతే చర్యలు
పార్వతీపురం: ధాన్యం కొనుగోలు, మిల్లింగ్ ప్రక్రియలో నిబంధనలను పాటించని మిల్లర్లపై కఠిన చర్యలు చేపట్టాలని కలెక్టర్ డాక్టర్ ఎన్.ప్రభాకరరెడ్డి జిల్లా అధికారులకు ఆదేశాలు జారీచేశారు. ధాన్యం కొనుగోలుపై కలెక్టరేట్‌లో సోమవారం నిర్వహించిన సమీక్షా సమావేశంలో ఆయన మాట్లాడారు. కనీస ప్రాథమిక వసతులు, భద్రతా ప్రమాణాలను పాటించని మిల్లులను బ్లాక్‌లిస్టులో చేర్చాలని ఆదేశించారు. బ్యాంకు గ్యారెంటీలు ఆలస్యం చేస్తున్న మిల్లర్ల వివరాలు అందజేయాలన్నారు. ధాన్యం సేకరణలో రైతులకు ఇబ్బంది లేకుండా చూడాలని, తూనికల్లో తేడాలు చేసినా, అదనపు ధాన్యం డిమాండ్ చేసినా చర్యలు తీసుకోవాలన్నారు. కార్యక్రమంలో జేసీ సి.యశ్వంత్ కుమార్ రెడ్డి, పార్వతీపురం, పాలకొండ సబ్ కలెక్టర్లు ఆర్.వైశాలి, పవార్ స్వప్నిల్ జగన్నాథ్, సివిల్ సప్‌లై డీఎం శ్రీనివాస్, డీఎస్‌ఓ బాల సరస్వతి, జిల్లా వ్యవసాయాధికారి అన్నపూర్ణ, జిల్లా రైస్ మిల్లర్ల అసోసియేషన్ సభ్యులు పాల్గొన్నారు.
● కలెక్టర్ డాక్టర్ ఎన్.ప్రభాకరరెడ్డి


