ఉపాధి ఫీల్డ్ అసిస్టెంట్‌కు తీవ్రగాయాలు
కురుపాం: కురుపాం–గొరడ ప్రధాన రహదారిలో బుడ్డెమ్మ ఖర్జ సమీపంలో రెండు ద్విచక్రవాహనాలు ఎదురెదురుగా ఆదివారం సాయంత్రం ఢీ కొన్న ఘటనలో కిచ్చాడ పంచాయతీ ఉపాధి హామీ క్షేత్ర సహాయకుడు గోళ్ల గౌరీశంకర్‌కు తీవ్ర గాయాలయ్యాయి. సంఘటన స్థలం నుంచి కురుపాం సామాజిక ఆరోగ్య కేంద్రానికి 108 వాహనంలో తరలించగా వైద్యులు ప్రాథమిక వైద్యం అందించి మెరుగైన వైద్య సేవల కోసం పార్వతీపురం ఏరియా ఆస్పత్రికి తరలించాలని సూచించారు. బుడ్డెమ్మఖర్జ గ్రామంలో శుభకార్యానికి వెళ్లి స్వగ్రామం పట్టాయి దొరవలసకు ఫీల్డ్ అసిస్టెంట్ తిరిగి వెళ్లిపోతుండగా బుడ్డెమ్మఖర్జ సమీపంలో కురుపాం నుంచి కొల్లిగూడ గ్రామానికి వెళ్తున్న పి.మహేష్ తన ద్విచక్రవాహనంతో ఢీ కొట్టడంతో ప్రమాదం జరిగి గౌరీశంకర్ చెవి, ముక్కు నుంచి తీవ్ర రక్తస్రావమైంది. ఈ మేరకు పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.


